ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చిరస్మరణీయుడు మన్మోహన్‌సింగ్‌

ABN, Publish Date - Dec 28 , 2024 | 12:56 AM

ఢిల్లీలో మన్మోహన్‌సింగ్‌ పార్థివదేహానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సహచర ఎంపీలతో కలిసి కేశినేని చిన్ని నివాళులర్పించారు.

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్‌, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌

మాజీ ప్రధాని పార్థివదేహానికి ఎంపీ కేశినేని చిన్ని నివాళి

వన్‌టౌన్‌, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘ఆర్థిక సంస్కరణలకు పెద్దపీట వేయడంతో పాటు, పలు రంగాల్లో కీలకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మృతి దిగ్ర్భాంతి కలిగించింది. దేశం గొప్ప దార్శనికుడిని కోల్పోయింది. ప్రధాన మంత్రిగా, కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్‌గా, ఆర్థికవేత్తగా దేశానికి మన్మోహన్‌సింగ్‌ అందించిన సేవలు చిరస్మరణీ యం. ఆయన మరణం దేశానికి తీరనిలోటు.’ అని ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) అన్నారు. శుక్రవారం ఢిల్లీలో మన్మోహన్‌సింగ్‌ పార్థివదేహానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సహచర ఎంపీలతో కలిసి కేశినేని చిన్ని నివాళులర్పించారు. మన్మోహన్‌ సతీమణి గురుశరణ్‌ కౌర్‌తో పాటు కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Updated Date - Dec 28 , 2024 | 12:56 AM