ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Farooq Shubli: ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘన

ABN, Publish Date - Mar 06 , 2024 | 10:11 PM

పీలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షూబ్లీ (Farooq Shubli) అన్నారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖునీ అవుతోందన్నారు.

విజయవాడ: ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షూబ్లీ (Farooq Shubli) అన్నారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖునీ అవుతోందని మండిపడ్డారు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలవడానికి వెళ్తే రెవెన్యూ, పోలీసులు అడ్డుకున్నారని.. ఇది ఎంత దారుణమని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనను కమిషన్‌కు వివరించేందుకు వెళ్లిన తమను అడ్డుకోవడం హేయమైన చర్య అని ఫారూఖ్ షూబ్లీ చెప్పారు.

ఆ హత్య కేసును సీబీఐకి అప్పగించాలి: పాలేటి మహేష్

దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐకు అప్పగించాలని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి మహేష్(Paleti Mahesh) డిమాండ్ చేశారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... దళిత యువకుడు హత్య కేసులో నిందితుడుగా ఉన్న ఎమ్మెల్సీ అనంత్ బాబును బర్తరఫ్ చేయాలని కోరారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం కేసుపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టనున్నామని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో దళితుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ దళితులపై కపట ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. దళితులు జగన్ ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పాలేటి మహేష్ తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 06 , 2024 | 11:03 PM

Advertising
Advertising