ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పారిశ్రామికవేత్తలుగా ఎదగండి

ABN, Publish Date - Dec 30 , 2024 | 12:43 AM

హనుమాన్‌జంక్షన్‌లో ఇంటెలెక్చువల్‌ ఫోరం ఫర్‌ మాదిగాస్‌, ఇంటర్నేషనల్‌ మాదిగ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో 7వ ప్రపంచ మాదిగ దినోత్సవం సందర్భంగా మాదిగల వ్యాపార పారిశ్రామిక రంగ అవగాహన సదస్సు నిర్వహించారు.

మాదిగల పారిశ్రామిక అవగాహన సదస్సులో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌

అందుకోసం కసి, పట్టుదలతో పనిచేయండి

మాదిగలకు కేంద్ర మంత్రి ‘పెమ్మసాని’ పిలుపు

హనుమాన్‌జంక్షన్‌, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ‘మాదిగలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉద్యోగాలు చేయడమే కాదు. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. అందుకు ఎవరైతే సామాజికంగా, ఆర్థికంగా తక్కువగా చూశారోకసితో వారినే స్ఫూర్తిగా తీసుకోవాలి. పట్టుదల, లక్ష్యంతో పనిచేయాలి.’ అని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ సూచించారు. ఆదివారం హనుమాన్‌జంక్షన్‌లో ఇంటెలెక్చువల్‌ ఫోరం ఫర్‌ మాదిగాస్‌, ఇంటర్నేషనల్‌ మాదిగ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో 7వ ప్రపంచ మాదిగ దినోత్సవం సందర్భంగా మాదిగల వ్యాపార పారిశ్రామిక రంగ అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో పెమ్మసాని మాట్లాడారు. మాదిగలు పారిశ్రామికంగా ఎదగడానికి సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎంఎ్‌సఎంఈ కార్పొరేషన్‌ ద్వారా అనేక పథకాలను అమలు చేస్తున్నామని ఔత్సాహిక మాదిగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎంఎ్‌సఎంఈ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ తమ్మిరెడ్డి శివశంకరరావు సూచించారు. ఇంటర్నేషనల్‌ మాదిగ చాంబర్‌ అండ్‌ ట్రేడ్‌ ఇండస్ర్టీ సంస్థ లోగోను ఆవిష్కరించారు. ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, కొలికిపూడి శ్రీనివాసరావు, బుర్ల రామాంజనేయులు, ఇంటిలెక్చువల్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మాట్టా విద్యార్థి, ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు గడ్డం బాపిరాజు, ఐఎంసీటీఐ రాష్ట్ర అధ్యక్షుడు రావుల రాజేంద్రప్రసాద్‌, ఫోరం కర్ణాటక రాష్ట్ర్ట్ర అధ్యక్షుడు బీఆర్‌ మునిరాజ్‌, బెంగుళూరు రిటైర్డు జడ్జి కినికేరి మల్లికార్జుడి పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 12:43 AM