K. Ramakrishna: అదానీతో ఒప్పందాలను రద్దు చేయండి
ABN, Publish Date - Dec 20 , 2024 | 06:09 AM
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు.
సీఎం చంద్రబాబును కలిసిన సీపీఐ నేతలు
అమరావతి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. గత వైసీపీ ప్రభుత్వం అదానీతో కుదుర్చుకున్న 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ఒప్పందాలను రద్దు చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని సీఎంకు అందజేశారు. ఈ ఒప్పందాల్లోని లోటు పాట్లను, రాష్ట్ర ప్రభుత్వంపై పడే భారాలపైనా న్యాయ సలహాలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు తమతో చెప్పినట్లు రామకృష్ణ మీడియాకు తెలిపారు.
Updated Date - Dec 20 , 2024 | 06:09 AM