ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రమాదం అంచున ఉన్నా..పట్టించుకోరా!

ABN, Publish Date - Dec 30 , 2024 | 12:25 AM

పేద బతుకులు.. ప్రమాదం అంచున బతికీడు స్తున్నాయి.. ప్రమాదాలు జరుగుతున్నా పట్టిం చుకున్నవారే కానరావడంలేదు.. ఎన్నో ఏళ్లగా స మస్య ఉన్నా కనీసం కన్నెత్తి చూసినవారే లేరు. ఈ గురువారం నాలుగేళ్ల బాలుడి మృతితో మళ్లీ ఆ సమస్య వెలుగులోకి వచ్చింది..

నివాసాలకు చేర్చి ఉన్న వేగేశ్వరపురం ఎత్తిపోతల పథకం కాలువ

  • నివాసాలకు చేర్చి ప్రమాదకరంగా కాలువ

  • ఇటీవల నాలుగేళ్ల బాలుడి మృతి

  • తరచూ ప్రమాదాలు.. పట్టని పాలకులు

  • సమస్య పరిష్కరించాలని డిమాండ్‌

తాళ్లపూడి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : పేద బతుకులు.. ప్రమాదం అంచున బతికీడు స్తున్నాయి.. ప్రమాదాలు జరుగుతున్నా పట్టిం చుకున్నవారే కానరావడంలేదు.. ఎన్నో ఏళ్లగా స మస్య ఉన్నా కనీసం కన్నెత్తి చూసినవారే లేరు. ఈ గురువారం నాలుగేళ్ల బాలుడి మృతితో మళ్లీ ఆ సమస్య వెలుగులోకి వచ్చింది.. అయినా నేటి వరకూ ఏ ఒక్కరూ సమస్య పరిష్కారానికి స్పం దించిన దాఖలాలు లేవు. తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం ఎత్తిపోతల పఽథకం కాలువ వెం బడి బల్లిపాడు గ్రామంలో 15 కుటుంబాల నివాసం ఉంటున్నాయి. ఈ కాలువ రోడ్డుకు సమాంతరంగా ఉంటుంది.ఆదమరిచారో అంతే.. ఆ కాలువ చెంతన ఉండే నివాసంలో తల పాకుల ఝాన్సీరాణి తన ముగ్గురు పిల్లలతో నివాసం ఉంటుంది. చిన్న కుమారుడు అద్విత్‌ ఇటీవల అంగన్‌వాడీకి వెళ్లి సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చాడు. అమ్మతో ఆడుకుం టానని చెప్పి బయటకు వెళ్లాడు. ఎంతకీ అలి కిడి లేకపోవడంతో తల్లి కంగారుపడింది. ఎంత పిలిచినా పలకకపోవడంతో ఏమైపోయాడోనని వెతుక్కుంది. ఈ లోపున కు మారుడు కాలువలో విగత జీవిగా కనిపించాడు. దీం తో ఆమె కన్నీటిపర్యంతమైంది. కుమారుడిని పట్టుకుని బోరున విలపించింది..ప్రమాదాలు జరుగు తున్నా పట్టించుకోరా అంటూ ఆవే దన వ్యక్తం చేసింది.ప్రమాదాలు జరగకుండా కాలువ గట్టు వద్ద రక్షణ ఏర్పాటు చేయాలని గతంలో పలుమార్లు అధికారులకు విన్నవిం చుకున్నామని అయినా స్పందనలేని బంధు వులు విలపించారు.తమ మధ్య ఆడుతూ పాడు తూ తిరిగే బాలుడు మృతితో ఆ కాలువ వైపు చూడాలంటేనే జనం భయపడుతున్నారు. ఇక నైనా నాయకులు స్పందించి సమస్యను పరిష్క రించాలని డిమాండ్‌ చేస్తున్నారు.ఎన్నికల సమ యంలో ఓట్ల కోసం వచ్చే నాయకులు కష్టంలో ఉన్నా కనీసం స్పందించలేదని వాపోయారు.

  • నా కష్టం వేరెవరికి రాకూడదు : ఝాన్సీరాణి, బాలుడి తల్లి

నా పరిస్థితి వేరెవరికి రాకూడదు.. ఇంకా నా కొడుకు ఎక్కడ అని వెతుక్కుం టున్నాను.. చాలా బాధగా ఉంది.. అప్పుడే వాడు లేకుండా నాలుగు రోజులు గడిపేశాను.. చాలా కష్టంగా ఉంటుంది.. వాడిని కాపాడుకోలేకపోయాను.. నా చేతులారా చంపేసుకున్నట్టు అయిపోయింది.. చాలా కాలంగా సమస్యను పాలకులకు విన్నవిస్తున్నా పట్టించుకోలేదు. అందుకే ఈ రోజు నాకు ఇటువంటి పరిస్థితి వచ్చింది.. ఇకనైనా పాలకులు స్పందించి సమస్యను పరిష్కరించాలి.

Updated Date - Dec 30 , 2024 | 12:29 AM