ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మూడు ర్యాంపులకు టెండర్లు

ABN, Publish Date - Dec 23 , 2024 | 12:32 AM

జిల్లాలో మూడు ఇసుక రీచ్‌లకు జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ టెండరు నోటిఫికేషన్‌జారీ చేశారు. కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని మూడు కీలకమైన ఇసుక ర్యాంపుల్లో తవ్వకాలు, లోడింగ్‌, అన్‌లోడింగ్‌, స్టోరేజ్‌ పాయింట్‌ వద్ద ఇసుక నిల్వ చేసేందుకు టెండర్లు పిలిచారు. అయితే ఈ షార్ట్‌ టెండర్ల నోటీసులో అధికారులు విధించిన నిబంధనల పట్ల కాంట్రాక్టర్ల నుంచి నిరసనలు వినిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక ర్యాంపులు నిర్వహించిన కాంట్రాక్టర్లకే అనుకూలంగా ఉండే విధంగా నిబంధనలు రూపొందించడం పట్ల పలువురు ఆరోపణాస్ర్తాలు సంధిస్తున్నారు.

నిబంధనలు అమలుపై కాంట్రాక్టర్ల మల్లగుల్లాలు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూడు ఇసుక రీచ్‌లకు జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ టెండరు నోటిఫికేషన్‌జారీ చేశారు. కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని మూడు కీలకమైన ఇసుక ర్యాంపుల్లో తవ్వకాలు, లోడింగ్‌, అన్‌లోడింగ్‌, స్టోరేజ్‌ పాయింట్‌ వద్ద ఇసుక నిల్వ చేసేందుకు టెండర్లు పిలిచారు. అయితే ఈ షార్ట్‌ టెండర్ల నోటీసులో అధికారులు విధించిన నిబంధనల పట్ల కాంట్రాక్టర్ల నుంచి నిరసనలు వినిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక ర్యాంపులు నిర్వహించిన కాంట్రాక్టర్లకే అనుకూలంగా ఉండే విధంగా నిబంధనలు రూపొందించడం పట్ల పలువురు ఆరోపణాస్ర్తాలు సంధిస్తున్నారు. కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని రావులపాలెం మండలం గోపాలపురం(మల్లేశ్వరం) ర్యాంపులో 74,700 మెట్రిక్‌ టన్నుల ఇసుకను తవ్వేందుకు టెండరు జారీ చేశారు. అదే విధంగా ఆత్రేయపురం మండలం అంకంపాలెం ఇసుక రీచ్‌లో 1,47,810 టన్నుల ఇసుకను తీసేందుకు, రావులపాలెం మండలం పొడగట్లపల్లి-ఏ ర్యాంపులో 3,74,475 మెట్రిక్‌ టన్నుల ఇసుకను తీసేందుకు టెండరు తయారు చేశారు. రీచ్‌లలో ఉన్న ఇసుక మాన్యువల్‌ తవ్వకం లోడింగ్‌, నిల్వ కేంద్రం వద్దకు రవాణా, స్టాకు పాయింట్‌ వద్ద లోడింగ్‌ కోసం గోపాలపురం రీచ్‌కు ఆహ్వానించారు. అదే విధంగా అంకంపాలెం, పొడగట్లపల్లి రీచ్‌లకు ఇసుక సెమిమెకనైజ్‌ తవ్వకం, ఇసుక రీచ్‌లలో లోడింగ్‌, స్టాకు పాయింట్‌ వద్ద ఏర్పాట్లు కోసం సీల్డు టెండర్లను పిలిచారు. ఈ నెల 20వ తేదీన జిల్లాస్థాయి ఇసుక కమిటీ ఇందుకోసం పబ్లికేషన్‌ విడుదల చేసింది. అయితే పొడగట్లపల్లి ర్యాంపులో కాలపరిమితిని విధించకుండానే ఆదేశాలు జారీ చేయడం అనుమానాలు రేకెత్తిస్తోంది. దీనిలో భాగంగా టెండర్ల షెడ్యూల్‌లో సూచించిన నిబంధనలు గత ప్రభుత్వ హయాంలో ఇసుక రీచ్‌లలో పాల్గొన్నవారికి మాత్రమే అనుకూలంగా ఉండే విధంగా నిబంధనలు ఉన్నట్టు కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. 2021-22 నుంచి 2023-24 మధ్య కాలంలో 5 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక పరిమాణాన్ని వెలికితీతతో కలిపి రూ.3.50 కోట్లు విలువైన ఇసుక మైనింగ్‌ పనులు చేపట్టి ఉండాలనేది ఒక నిబంధన. టెండరు దాఖలు చేసేవారు తప్పనిసరిగా యంత్ర పరికరాలకు సంబంధించి సాక్ష్యాలను సమర్పించాలి. ఇసుక తవ్వకంలో అనుభవ ధ్రువీకరణపత్రం ఇవ్వాలి. పరికరాలకు సంబంధించి రిజిస్ర్టేషన్‌, బీమా సర్టిఫికెట్లతో పాటు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కూడా అందజేయాలని ఆ నిబంధనల్లో పేర్కొన్నారు. బిడ్‌లు సమర్పణ గడువు తేదీలోగా ఏదైనా సీపీఎస్‌యూ, రాష్ట్ర పీఎస్‌యూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలు బిడ్డర్‌ను బ్లాక్‌ లిస్టులో ఉంచకూడదు అనే నిబంధనను కూడా పేర్కొన్నారు. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో కనీస సగటు వార్షిక టర్నోవర్‌ ఐఎన్‌ఆర్‌ రూ4 కోట్లను కలిగి ఉండాలి. అయితే టెండరు నిబంధనల్లో అధికారులు సూచించిన నిబంధనల ప్రకారం గత ప్రభుత్వంలోనే ఇసుక కాంట్రాక్టర్లు నిర్వహించిన వారికి మాత్రమే ఈ టెండర్లలో అవకాశం దక్కనుందని శాండ్‌ కమిటీ జారీ చేసిన నిబంధనలు చెబుతున్నాయి. సోమవారం సాయంత్రం 5 గంటలలోగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో టెండర్ల దాఖలుకు గడువు ముగియనుంది.

Updated Date - Dec 23 , 2024 | 12:32 AM