వీహెచ్‌పీ జాతీయ ట్రస్టీగా పుట్టగుంట సతీశ్
ABN, Publish Date - Dec 19 , 2024 | 04:11 AM
విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) జాతీయ ట్రస్టీగా విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ పుట్టగుంట వెంకట సతీశ్‌కుమార్ నియమితులయ్యారు.
విజయవాడ, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) జాతీయ ట్రస్టీగా విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ పుట్టగుంట వెంకట సతీశ్‌కుమార్ నియమితులయ్యారు. వీహెచ్‌పీ జాతీయ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే ఆదేశాల మేరకు ఆయన్ను ఈ పదవిలో నియమించారు. బుధవారం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో వీహెచ్‌పీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు సతీశ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ పదవిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గోకరాజు గంగరాజు, పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత పుల్లారెడ్డి, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ నిర్వహించారు. జాతీయ ట్రస్టీ హోదాలో సతీశ్ మూడేళ్లు ఉంటారు.
Updated Date - Dec 19 , 2024 | 04:11 AM