ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గిరిజన గూడేలకు మెరుగైన రోడ్లు

ABN, Publish Date - Dec 31 , 2024 | 03:27 AM

గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక బలహీన గిరిజన సమూహాల(పీవీటీజీ) నివాసిత ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ కల్పించడంలో ఆర్నెలల్లోనే కూటమి ప్రభుత్వం అద్భుత విజయాలు సాధించింది.

కూటమి ప్రభుత్వ ఆర్నెల్లలో 750 కోట్ల మేర నిర్మాణ పనులు

ఐదేళ్ల వైసీపీ హయాంలో చేసింది రూ.91 కోట్ల పనులే

అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక బలహీన గిరిజన సమూహాల(పీవీటీజీ) నివాసిత ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ కల్పించడంలో ఆర్నెలల్లోనే కూటమి ప్రభుత్వం అద్భుత విజయాలు సాధించింది. గత వైసీపీ సర్కారు 2019-24 మధ్య పీవీటీజీ ప్రాంతాల్లో రోడ్లకు కేవలం రూ.91కోట్లు ఖర్చు పెడితే... సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి సర్కార్‌ ఆర్నెలల్లోనే రూ.750 కోట్ల పనులు చేపట్టింది. జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లలో పీఎంజీఎస్‌వై కింద రూ.69 కోట్లు, ఏఐఐబీ ద్వారా రూ.22 కోట్ల పనులు చేయగా.. ఈ ఆర్నెల్లలో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా పీఎం జన్‌మాన్‌ నిధులతో రూ.550 కోట్లు, ఉపాధి హామీ పథకం కింద రూ.150 కోట్లు, డోలీ మోతల నివారణకు రోడ్డు కనెక్టివిటీ కోసం రూ.49 కోట్లతో కలిపి మొత్తం రూ.750 కోట్లు ఖర్చు చేశారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు.

Updated Date - Dec 31 , 2024 | 03:27 AM