ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu Naidu: చంద్రబాబుని కలిసిన ఆశావహులు.. పార్టీ కోసం పని చేస్తామని హామీ

ABN, Publish Date - Feb 27 , 2024 | 09:33 PM

జనసేనతో (Janasena) కలిసి తొలి జాబితాను విడుదల చేసిన తర్వాత ఆశావహులు, నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో (Chandrababu Naidu) భేటీ అవుతున్నారు. మంగళవారం కూడా ఉండవల్లిలో చంద్రబాబుని కొందరు కలిశారు. ఈ సందర్భంగా.. పార్టీ ప్రకటించిన అభ్యర్థులను గెలిపించాలని ఆయన సూచించారు.

జనసేనతో (Janasena) కలిసి తొలి జాబితాను విడుదల చేసిన తర్వాత ఆశావహులు, నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో (Chandrababu Naidu) భేటీ అవుతున్నారు. మంగళవారం కూడా ఉండవల్లిలో చంద్రబాబుని కొందరు కలిశారు. ఈ సందర్భంగా.. పార్టీ ప్రకటించిన అభ్యర్థులను గెలిపించాలని ఆయన సూచించారు. సీటు రాలేదంటే పార్టీ వద్దు అనుకున్నట్లు కాదని.. సర్వేలు, సామాజిక సమీకరణాలు, ప్రజల అభిప్రాయాల మేరకు అభ్యర్థుల ఎంపిక జరిగిందని నేతలకు వివరించారు. భేటీ అనంతరం పార్టీ అభ్యర్థుల గెలుపుకు తాము పని చేస్తామని చంద్రబాబుకు పలువురు నేతలు హామీ ఇచ్చారు.


రాయచోటి నియోజకవర్గం టిక్కెట్‌ని రాం ప్రసాద్ రెడ్డికి టీడీపీ కేటాయించగా.. ఆయనకు అన్ని విధాల సహకరించాలని ముఖ్యనేత ప్రసాద్‌కు చంద్రబాబు సూచనలు జారీ చేశారు. ఇద్దరు నేతలు చేతులు కలిపి.. సీటు గెలిచి రావాలని అన్నారు. సింగనమల టిక్కెట్‌ను బండారు శ్రావణికి ప్రకటించిన నేపథ్యంలో.. ఆ నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్న కేశవ్ రెడ్డి, నర్సానాయుడులను పిలిచి చంద్రబాబు మాట్లాడారు. విభేదాలు పక్కన పెట్టి, శ్రావణి గెలుపుకు సహకరించాలని ఆదేశించారు. అటు.. పొత్తులో భాగంగా నెల్లిమర సీటు జనసేనకు కేటాయించడంతో, అక్కడి టీడీపీ ఇంచార్జ్ కర్రోతు బంగార్రాజుతో టీడీపీ అధినేత భేటీ అయ్యారు. పొత్తులో భాగంగా సీటు ఇవ్వాల్సి వచ్చిందని, జనసేన గెలుపు కోసం పని చేయాలని చెప్పారు. పొత్తులో సీటు కోల్పోయిన వారికి టీడీపీ తప్పకుండా న్యాయం చేస్తుందని, సముచిత స్థానం కల్పిస్తుందని భరోసా కల్పించారు.

కర్నూలు పార్లమెంట్ నేతలు బానుశంకర్, బస్తిపాటి నాగరాజు లతో పాటు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, నంద్యాల పార్లమెంట్ నాయకుడు కేవీ సుబ్బారెడ్డి, జేసీ పవన్, రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, తంబళ్ల పల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్‌లతో పలువురు నేతలు చంద్రబాబుని కలిశారు. సీట్ల విషయంలో వీళ్లిందరితో మాట్లాడి ఆయన క్లారిటీ ఇస్తున్నారు. అసంతృప్తిగా ఉన్న నేతలతో స్వయంగా మాట్లాడుతూ సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇలా భేటీ అయిన తర్వాత మెత్తబడ్డ నేతలు.. పార్టీ కోసం తాము పని చేస్తామని మాటిచ్చారు.

Updated Date - Feb 27 , 2024 | 09:34 PM

Advertising
Advertising