ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేడు 75వ రాజ్యాంగ దినోత్సవం

ABN, Publish Date - Nov 26 , 2024 | 05:23 AM

ఈ నెల 26వ తేదీన 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

  • రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఉత్తర్వులు

అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 26వ తేదీన 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి ఈ నెల 26 నాటికి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా రాజ్యాంగ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ రాజకీయ కార్యదర్శి ఎస్‌.సురే్‌షకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వేడుకల్లో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ఆర్పించడంతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న అందరితో రాజ్యాంగ పీఠికను చదివించాలని సూచించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ఉదయం 11.30 గంటలకు జరిగే రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొంటారు. జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో 75వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాలను జిల్లా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నారు.

Updated Date - Nov 26 , 2024 | 05:23 AM