Nemakallu నేమకల్లు అంజన్నకు విశేష పూజలు
ABN, Publish Date - Dec 22 , 2024 | 12:03 AM
మండలంలోని నేమకల్లు గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి వారికి శనివారం విశేష పూజలు జరిగాయి.
పుష్పాలంకరణలో ఆంజనేయస్వామి
బొమ్మనహాళ్, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): మండలంలోని నేమకల్లు గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి వారికి శనివారం విశేష పూజలు జరిగాయి. ప్రధాన అర్చకులు అనిల్‌కుమార్‌చార్యులు, సంతో్‌షకుమార్ చార్యులు పూజలు నిర్వహించారు. ఉదయం పంచామృతాభిషేకం, నిర్మాల్యవిసర్జన, వి ష్ణుపారాయణం, అష్టోత్తరం ని ర్వహించి స్వామి వారి మూలవిరాట్‌కు పుష్పాలంకరణ చేసి, నైవేద్యం సమర్పించారు. భక్తు లు అధిక సంఖ్యలో స్వామి వా రిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఈఓ నరసింహారెడ్డి, ఓ బన్న తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 22 , 2024 | 12:03 AM