ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Supreme Court: హెచ్‌సీఏ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం చేసిన సుప్రీం

ABN, First Publish Date - 2023-09-15T14:04:43+05:30

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు ఎన్నికల నిర్వహణకు సుప్రీం కోర్టు మార్గం సుగమం చేసింది. ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని తొలగించాలి అంటే... ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గం అని ఉన్నతన్యాస్థానం పేర్కొంది.

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు (HCA elections) ఎన్నికల నిర్వహణకు సుప్రీం కోర్టు (Supreme Court) మార్గం సుగమం చేసింది. ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని తొలగించాలి అంటే... ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గం అని ఉన్నతన్యాస్థానం పేర్కొంది. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో గుర్తింపు, సంఘంలో నెలకొన్న పలు అంశాలపై హెచ్‌సీఏ, ఛార్మినార్‌ క్రికెట్‌ అసోసియేషన్‌, అజహరుద్దీన్‌, జాన్‌ మనోజ్‌, బుడ్డింగ్‌ స్టార్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. శుక్రవారం ఈ కేసును జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సుధాంశు ధులియా ధర్మాసనం విచారించింది. అసోసియేషన్‌కు ఎన్నికలు నిర్వహించి, కొత్త కమిటి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలని దర్మాసనం పేర్కొంది. హెచ్‌సీఏ వ్యవహారాలపై గతంలో సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ఏకసభ్య కమిషనే... ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Updated Date - 2023-09-15T14:11:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising