ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLC Kavitha : కవిత, కేజ్రీవాల్‌లపై ఆరోపణలు చేస్తూ సుఖేశ్ చంద్రశేఖర్ మరో లేఖ..

ABN, First Publish Date - 2023-05-24T11:44:46+05:30

మనీలాండరింగ్ కేసులో అరెస్టయి ఢిల్లీ జైలులో ఉన్న సుఖేశ్‌‌ చంద్రశేఖర్ నేడు మరో లేఖను విడుదల చేశారు. ఈసారి ఎమ్మెల్సీ కవితతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై సైతం ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ఇంటి నిర్మాణంపై సుఖేశ్ చంద్రశేఖర్ మరోసారి ఆరోపణలు చేశారు. ఆ ఇంటి ఫర్నిచర్‌కి అయిన ఖర్చులను తానే భరించానన్నారు. అందుకు సంబంధించిన బిల్లులున్నాయని వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో అరెస్టయి ఢిల్లీ జైలులో ఉన్న సుఖేశ్‌‌ చంద్రశేఖర్ నేడు మరో లేఖను విడుదల చేశారు. ఈసారి ఎమ్మెల్సీ కవితతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై సైతం ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ఇంటి నిర్మాణంపై సుఖేశ్ చంద్రశేఖర్ మరోసారి ఆరోపణలు చేశారు. ఆ ఇంటి ఫర్నిచర్‌కి అయిన ఖర్చులను తానే భరించానన్నారు. అందుకు సంబంధించిన బిల్లులున్నాయని వెల్లడించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత షెల్ కంపెనీల అకౌంట్స్ నుంచి మారిషస్ లోని కైలాష్ గెహ్లాట్ బంధువుల అకౌంట్లకు నగదు బదిలీ అయ్యిందని తెలిపారు. 25+25+30 కోట్ల నగదు బదిలీలు జరిగాయన్నారు.

ఇందుకు సంబంధించి కేజ్రీవాల్ ఫేస్ టైం చాట్స్ వివరాలను కూడా త్వరలోనే విడుదల చేస్తానని సుఖేశ్ చంద్రశేఖర్ తెలిపారు. వాస్తవాలు బయటపెడుతున్నందుకే తనను మానసికంగా వేధిస్తున్నారని పేర్కొన్నారు. తనకు అనుకూలమైన జైలు అధికారుల ద్వారా వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. ఈ విషయంపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశానన్నారు. త్వరలోనే కేజ్రీ వాల్‌కు సంబంధించి మరో కుంభకోణాన్ని బయట పెడతానని సుఖేశ్ చంద్రశేఖర్ వెల్లడించారు.

Updated Date - 2023-05-24T11:44:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising