KTR: కొందరు పనికిమాలిన పాదయాత్రలు చేస్తున్నారు: కేటీఆర్
ABN, First Publish Date - 2023-02-27T20:01:15+05:30
కొందరు పనికిమాలిన పాదయాత్రలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొందరు పనికిమాలిన పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు.
హనుమకొండ: కొందరు పనికిమాలిన పాదయాత్రలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొందరు పనికిమాలిన పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. ‘‘ఒక్క ఛాన్స్ ఇవ్వండని అంటున్నారని, యాభై ఏళ్లు అధికారంలో ఉండి ఏం పీకారని దుయ్యబట్టారు. మాది బరాబర్ కుటుంబ పాలనే. మా పాలనలో అభివృద్ధే తప్ప.. మత ఘర్షణలు లేవు. కేంద్ర ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వం. ఆదాయం పెంచుతామని మోసం చేసిన ప్రధాని ఎవరికి దేవుడు?.. ప్రధాని మోదీ అదానీకి దేవుడు కావొచ్చేమో కానీ.. తెలంగాణకు పట్టిన శని. విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టాలన్నదే కేంద్రం పని’’ అని కేటీఆర్ మండిపడ్డారు.
Updated Date - 2023-02-27T20:01:16+05:30 IST