ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sids Farm: పెరిగిన ఇన్‌పుట్ వ్యయం.. పాల ధరను రూ. 2 పెంచిన సిద్స్ ఫామ్

ABN, First Publish Date - 2023-02-04T21:31:08+05:30

ఇన్‌పుట్ వ్యయం పెరగడంతో పాల ధరను రెండు రూపాయలు పెంచినట్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఇన్‌పుట్ వ్యయం పెరగడంతో పాల ధరను రెండు రూపాయలు పెంచినట్టు సిద్స్ ఫామ్(Sids Farm) తెలిపింది. తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఎ2 గేదెపాలు, స్కిమ్ మిల్క్, ఎ2 డబుల్ టోన్డ్ గేదె పాల ధరను ప్యాకెట్‌కు రూ. 2 పెంచుతున్నట్టు పేర్కొంది. ధర పెంపు నేపథ్యంలో ఇప్పుడు అర లీటర్ ఎ2 గేదెపాల ప్యాకెట్ ధర రూ. 52కు, స్కిమ్ పాల ధర రూ. 32కు పెరిగింది. ఎ2 డబుల్ డోన్డ్ గేదెపాల ధర రూ. 42 అయింది. అయితే, ఎ2 దేశీ ఆవుపాల ధర మాత్రం రూ. 75లో మాత్రం ఎలాంటి మార్పు లేదని తెలిపింది.

పాల ధర పెంపుపై సిద్స్ ఫామ్ వ్యవస్థాపకుడు డాక్టర్ కిశోర్ ఇందుకూరి(Kishore Indukuri) మాట్లాడుతూ.. అత్యున్నత నాణ్యత కలిగిన పాల ఉత్పత్తులను అందిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఇన్‌పుట్ వ్యయం పెరగడంతో తప్పని పరిస్థితిలో పాల ధరను పెంచాల్సి వచ్చిందన్నారు. పెరిగిన ధర వినియోగదారులకు భారమే అయినప్పటికీ పెరుగుతున్న అవసరాలు తీర్చేందుకు తప్పడం లేదని కిశోర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-02-04T21:31:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising