ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rain: ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వర్షం

ABN, First Publish Date - 2023-03-16T21:46:35+05:30

ఉమ్మడి మెదక్‌ జిల్లా (Medak District)లో గురువారం పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం (Heavy Rain) కురిసింది. సంగారెడ్డి కోహీర్‌, జహీరాబాద్‌ మండలాల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మెదక్‌: ఉమ్మడి మెదక్‌ జిల్లా (Medak District)లో గురువారం పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం (Heavy Rain) కురిసింది. సంగారెడ్డి కోహీర్‌, జహీరాబాద్‌ మండలాల్లో వడగండ్ల వాన కురిసింది. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా న్యాల్‌కల్‌ మండలంలో 35.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కనిష్ఠంగా గుమ్మడిదల, రామచంద్రాపురం, కల్హేర్‌ ప్రాంతాల్లో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాయికోడ్‌, న్యాల్‌కల్‌, కోహీర్‌, జహీరాబాద్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో మొక్కజొన్న, జొన్న, తెల్లకుసుమ, మిరప, చెరుకు, శనగ తదితర పంటలకు నష్టం వాటిల్లింది. ఆయా ప్రాంతాల్లో ఈదురుగాలుల వల్ల విద్యుత్‌ సరఫరా కూడా అంతరాయం ఏర్పడింది. మెదక్‌ జిల్లాలోని నిజాంపేట, మనోహరాబాద్‌, చేగుంట, నార్సింగి, పెద్దశంకరంపేట, చిలప్‌చెడ్‌ మండలాల్లో సన్నటి జల్లులు కురిశాయి. మెదక్‌ పట్టణంలో ఉరుములు, మెరుపులతో కూడిన చిన్నపాటి వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లాలోనూ చిరుజల్లులు కురిశాయి. కారుమబ్బులు కమ్ముకోవడంతో సాయంత్రం 4 గంటలకే చీకటి పడిన వాతావరణం కనిపించింది. మరో మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2023-03-16T21:46:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising