ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Onions: తగ్గిన ఉల్లిధర.. కిలో రూ.5 మాత్రమే...

ABN, Publish Date - Dec 17 , 2023 | 12:26 PM

ఉల్లి గడ్డ ధర తగ్గింది. మహారాష్ట్ర, కర్ణాటక, మహబూబ్‌నగర్‌(Maharashtra, Karnataka, Mahbubnagar) నుంచి

- మలక్‌పేట మార్కెట్‌కు భారీగా సరుకు రాక

చాదర్‌ఘాట్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): ఉల్లి గడ్డ ధర తగ్గింది. మహారాష్ట్ర, కర్ణాటక, మహబూబ్‌నగర్‌(Maharashtra, Karnataka, Mahbubnagar) నుంచి భారీగా సరుకు రావడమే ఇందుకు కారణమని మలక్‌పేట మార్గెట్‌(Malakpet Margate) వర్గాలు పేర్కొన్నాయి. మార్కెట్‌లో శనివారం జరిగిన వేలం పాటలో కనిష్ఠ ధర కిలో రూ.5 పలికింది. గత సోమవారం మహారాష్ట్ర ఉల్లిగడ్డ కనిష్ఠ ధర రూ.10 పలకగా శనివారం కూడా ఇదే ధర పలికింది. మార్కెట్‌కు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి 18,090 క్వింటాళ్ల ఉల్లి రాగా మొదటి రకం కిలో రూ.30, రెండో రకం రూ.25, మూడో రకం రూ.5 పలికింది. మహబూబ్‌నగర్‌ నుంచి 105 క్వింటాళ్ల ఉల్లి రాగా మొదటి రకం కిలో రూ.20, రెండో రకం రూ.16, మూడో రకం రూ.5 పలికింది. కర్నూలు నుంచి 1215 క్వింటాళ్ల ఉల్లి రాగా మొదటి రకం కిలో రూ.18, రెండో రకం రూ.15, మూడో రకం రూ.5 పలికింది.

బహిరంగ మార్కెట్‌లో తగ్గని ధర...

మలక్‌పేట మార్కెట్‌లో జరిగిన వేలం పాటలో ఉల్లి కనిష్ఠ ధర కిలో రూ.5 పలుకుతుండగా బహిరంగ మార్కెట్‌లో రూ.30కు తగ్గడం లేదు. తోపుడు బండ్లపై కిలో రూ.30కు, కిరాణా షాపులు, సూపర్‌మార్కెట్లలో రూ.40 నుంచి రూ.50కు విక్రయిస్తున్నారు.

Updated Date - Dec 17 , 2023 | 12:26 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising