ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: సీఎం కేసీఆర్‌కు షబ్బీర్ అలీ సవాల్

ABN, First Publish Date - 2023-04-15T17:35:09+05:30

అంబేద్కర్ విగ్రహం నిర్మించడం కాదు, దమ్ముంటే దళితున్ని ముఖ్యమంత్రి చేయ్యాలని సీఎం కేసీఆర్‌ (CM KCR)కు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ (Shabbir Ali) సవాల్ విసిరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కామారెడ్డి: అంబేద్కర్ విగ్రహం నిర్మించడం కాదు, దమ్ముంటే దళితున్ని ముఖ్యమంత్రి చేయ్యాలని సీఎం కేసీఆర్‌ (CM KCR)కు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ (Shabbir Ali) సవాల్ విసిరారు.TSPSC పేపర్ల లీకేజీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైఫల్యం - నిరుద్యోగుల గోస - అఖిలపక్ష పార్టీల భరోసా పేరిట కామారెడ్డిలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో తుపాకుల రాజ్యం మళ్లీ వస్తుందన్నారు. కేసీఆర్ పాలన‌లో మళ్లీ నక్సలిజం పుట్టుకొస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ తుపాకులు పట్టుకొని నక్సల్స్ సమాజంలో తిరుగుతారని వ్యాఖ్యానించారు. పేపర్ల లీకేజీ వల్ల 30 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 9 సంవత్సరాలలో ఉద్యోగాలు లేవని, కేసీఆర్‌కు చెందిన 40 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తెలంగాణలో అమలు కావడం లేదని.. ఇక్కడ కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తుందన్నారు. తెలంగాణ సమాజాన్ని లిక్కర్ రాజ్యంగా మార్చేశాడని మండిపడ్డారు.

Updated Date - 2023-04-15T17:35:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising