ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Speaker Pocharam: 25న ప్రతీ నియోజకవర్గoలో ప్లీనరీ సమవేశాలు..

ABN, First Publish Date - 2023-04-24T12:46:09+05:30

కామారెడ్డి జిల్లా: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మంగళవారం (25వ తేదీ) ప్రతీ నియోజకవర్గoలో ప్లీనరీ సమవేశాలు నిర్వహిస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి జిల్లా: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ (Telangana Independence Day) సందర్భంగా మంగళవారం (25వ తేదీ) ప్రతీ నియోజకవర్గoలో ప్లీనరీ సమవేశాలు (Plenary Sessions) నిర్వహిస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Speaker Pocharam Srinivas Reddy) స్పష్టం చేశారు. ఈ సందర్బంగా సోమవారం బాన్సువాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశంలో స్పీకర్ హోదాలో కాకుండా నియోజకవర్గ ఎమ్మెల్యే హోదాలో పాల్గొంటానన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చేందుకు కొన్ని పార్టీలు పేపర్లు లీక్ చేసి డ్రామా ఆడుతున్నాయని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మాదిరి అన్ని రాష్ట్రాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లను, రైతు బంధు, రైతు భీమా పథకాలను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం ప్రభుత్వం కక్ష సాధింపు చర్యతో నేతలపై సీబీఐ, ఈడీ దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ (CM KCR) ధైర్యవంతుడని, ఎవరికి భయపడే మనిషి కాదన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ కొరకు 250 కోట్ల రూపాయలను కేటాయించామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-04-24T12:46:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising