Nalgonda Dist.: సీఎం కేసీఆర్ నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటన..
ABN, First Publish Date - 2023-10-31T08:02:44+05:30
నల్గొండ జిల్లా: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి పర్యటించి.. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న సభల్లో ప్రసంగించనున్నారు.
నల్గొండ జిల్లా: అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నేపథ్యంలో సీఎం కేసీఆర్ (CM KCR) ప్రజా ఆశీర్వాద సభల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం హుజూర్‌నగర్ (Huzurnagar), మిర్యాలగూడ (Miryalaguda), దేవరకొండ (Devarakonda) నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి పర్యటించి.. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న సభల్లో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు, హుజూర్ నగర్, 3 గంటలకు మిర్యాలగూడ, 4 గంటలకు దేవరకొండ సభలకు సీఎం హాజరు కానున్నారు. కాగా నల్గొండలో మంగళవారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది.
ఎన్నికల్లో విజయం సాధించేందుకు సీఎం కేసీఆర్ బహిరంగ సభ బీఆర్‌ఎస్ నేతలకు బ్రహ్మాస్త్రం లాంటిది. దీన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యేలు తీవ్రంగా యత్నిస్తున్నారు. సీఎం పర్యటన షెడ్యూల్ ముందస్తుగానే ఖరారు కావడంతో, ఆ తేదీలకు రెండురోజుల ముందు గడపగడపకూ ప్రచారాన్ని సైతం పక్కనపెట్టి ఎమ్మెల్యేలు, కీలక నేతలు సీఎం సభకు ఏర్పాట్లు, జనసమీకరణలో నిమగ్నమవుతున్నారు. బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలతో పాటు సాధారణ జనాన్ని సభకు తరలించేందుకు వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మొదటి దఫా కొంత ప్రచారం పూర్తి చేసిన ఎమ్మెల్యేలు సీఎం సభ అనంతరం పూర్తి స్థాయిలో ప్రచారంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
Updated Date - 2023-10-31T08:02:44+05:30 IST