ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BRS MLA: కుమార్తె ఆరోపణలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి స్పందన

ABN, First Publish Date - 2023-06-25T18:05:55+05:30

కుమార్తె (daughter) తుల్జాభవానీ ఆరోపణలపై బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే ముత్తిరెడ్డి స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌: కుమార్తె (daughter) తుల్జాభవానీరెడ్డి ఆరోపణలపై బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే ముత్తిరెడ్డి స్పందించారు. తాను భూకబ్జాలు చేయలేదని ఏబీఎన్‌తో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చెప్పారు. తనను ఎదుర్కోలేని వారే తన కుమార్తెను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ముత్తిరెడ్డి విమర్శించారు.

తాను పట్టా భూమినే కొన్నానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి స్పష్టం చేశారు. అది ప్రభుత్వ భూమి అని తేలితే.. తాను ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. ఇక్కడ ఏం జరుగుతోందో సీఎం కేసీఆర్‌కు అంతా తెలుసని, ఎవరు చేయిస్తున్నారో అందరికీ తెలుసని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మండిపడ్డారు. ఈ ఆరోపణలను ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని ముత్తిరెడ్డి పేర్కొన్నారు.

కాగా.. సిద్దిపేటలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, కుమార్తె తుల్జాభవానీ మధ్య వివాదం నడుస్తోంది. చేర్యాలలో తన పేరు మీద ఉన్న 21 గుంటల భూమిని మున్సిపాలిటీకి అప్పగిస్తానని ఎమ్మెల్యే కుమార్తె తుల్జాభవానీ స్పష్టం చేశారు. ముత్తిరెడ్డికి అధికార పొగరు తలకెక్కిందని తుల్జాభవానీ తండ్రిపై విమర్శలు గుప్పించారు.

తన తండ్రి చేసే కబ్జాల వల్ల తాను గిల్టీగా ఫీల్ అవుతున్నానని, తనకు కేసీఆర్ అండ ఉందని తన తండ్రి చెబుతారని తుల్జాభవానీ అన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అందరినీ భయపెడతాడని, భయపెట్టి ఓట్లు వేయించుకుంటాడని తుల్జాభవానీ ఆరోపించారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ధనదాహానికి వేరేవాళ్లెందుకు బలికావాలి?, రాజకీయాలతో తనకు సంబంధం లేదని తుల్జాభవానీ అన్నారు.

Updated Date - 2023-06-25T18:26:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising