Satyavati Rathod : కాంగ్రెస్ పార్టీ గిరిజనులను ఓటు బ్యాంకుగా వాడుకుంది
ABN, First Publish Date - 2023-10-28T18:14:59+05:30
కాంగ్రెస్ పార్టీ గిరిజనులను ఓటు బ్యాంకుగా వాడుకుందని మంత్రి సత్యవతి రాథోడ్ ( Minister Satyavati Rathod ) అన్నారు.
జనగామ: కాంగ్రెస్ పార్టీ గిరిజనులను ఓటు బ్యాంకుగా వాడుకుందని మంత్రి సత్యవతి రాథోడ్ ( Minister Satyavati Rathod ) అన్నారు. శనివారం నాడు స్టేషన్ ఘనపూర్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సమావేశంలో మంత్రులు హరీష్‌రావు, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ...‘‘గిరిజన నేత బెల్లయ్య నాయక్‌కు కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు. గిరిజలను కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిందేమీ లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి బాటలు వేసింది’’ అని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. కడియం శ్రీహరి, రాజయ్య కలిస్తే ప్రభంజనమేనని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు కృషి చేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.
కడియం శ్రీహరికి మద్దతిస్తా: తాటికొండ రాజయ్య
అధిష్టానం నిర్ణయం మేరకు నేను కడియం శ్రీహరికి మద్దతిస్తానని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ( Tatikonda Rajaiah ) అన్నారు. స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ సభలో ఆయన మాట్లాడుతూ..‘‘నన్ను ప్రస్తుతం జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించారు. అవసరం మేరకు నేను స్టేషన్ ఘనపూర్‌లో ప్రచారం చేస్తాను. నా వర్గీయులకు పార్టీలో సముచిత స్థానం కల్పించాలని హరీష్‌రావుని రాజయ్య కోరారు. నా జీవితం ఘనపూర్ ప్రజలకే అంకితం’’ అని రాజయ్య పేర్కొన్నారు.
Updated Date - 2023-10-28T18:14:59+05:30 IST