ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Cm Kcr: రేవంత్‌ నోరు తెరిస్తే గబ్బు.. అలాంటోళ్లు అవసరమా?

ABN, First Publish Date - 2023-11-22T16:21:29+05:30

నీతి నియమం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి. రూ.50 లక్షలతో ఎమ్మెల్యేలను కొంటూ పట్టుబడిన ఆయన తీరును ప్రజలంతా టీవీల్లో చూశారు. ఇవన్నీ చేసినా రేవంత్ రెడ్డి మళ్లీ సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది.

కొడంగల్‌: పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై సీఎం కేసీఆర్ (Cm kcr) నిప్పులు చెరిగారు. కొడంగల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతూ రేవంత్ టార్గెట్‌గా మండిపడ్డారు. ‘‘కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డి (Revanth reddy) పెద్ద భూకబ్జాదారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామంటున్నారు. రేవంత్‌ రెడ్డి కొడంగల్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయలేదు. రేవంత్‌ నోరు తెరిస్తే గబ్బు. ఆయన టికెట్లు అమ్ముకున్నారని కాంగ్రెస్‌ నేతలే అంటున్నారు. తెలంగాణ ఉద్యమకారులపైకి రేవంత్‌ తుపాకీ పట్టుకొని వెళ్లారు. కాంగ్రెస్‌ (Congress) నేతలకు వ్యవసాయం గురించి ఏమీ తెలియదు. రేవంత్ రెడ్డి ఏనాడైనా వ్యవసాయం చేశారా? పొలం దున్నారా? అందుకే ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.’’ అని ధ్వజమెత్తారు.

‘‘నీతి నియమం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి. రూ.50 లక్షలతో ఎమ్మెల్యేలను కొంటూ పట్టుబడిన ఆయన తీరును ప్రజలంతా టీవీల్లో చూశారు. ఇవన్నీ చేసినా రేవంత్ రెడ్డి మళ్లీ సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఇప్పుడు కొడంగల్‌లో సరిపోలేదని.. కామారెడ్డిలో నాపై పోటీకి వస్తున్నారు. రేవంత్‌ రెడ్డిని కొడంగల్‌లో చిత్తుగా ఓడించాలి. నేనే సీఎం అనేవాళ్లు కాంగ్రెస్‌లో 15 మంది ఉన్నారు. అయినా కాంగ్రెస్‌ గెలిస్తే కదా.. రేవంత్‌ సీఎం అయ్యేది. రేవంత్‌ సీఎం అవుతాడని ఓట్లేస్తే కొడంగల్‌ పరిస్థితి మళ్లీ మొదటికే. ప్రజలు ఇవన్నీ గమనించాలి. కొడంగల్‌లో పనిచేసే నరేందర్‌ రెడ్డి కావాలా? వట్టిమాటలు చెప్పే రేవంత్‌ రెడ్డి కావాలా? ప్రజలే తేల్చుకోవాలి. ఎమ్మెల్యేగా ఎవరుంటే కొడంగల్‌ గౌరవం పెరుగుతుందో ప్రజలే నిర్ణయం తీసుకోవాలి’’ అని కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-22T16:27:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising