Kunamneni: మునుగోడులో మేము బీఆరెస్‌కు మద్దతు ఇవ్వకపోతే బీజేపీ గెలిచేది..
ABN, First Publish Date - 2023-07-09T13:04:36+05:30
కరీంనగర్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలగించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి పదవి బాధ్యతలు అప్పగించడంపై బీజేపీ అధిష్టానం ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
కరీంనగర్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ (Bandi Sanjay)ను తొలగించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)కి పదవి బాధ్యతలు అప్పగించడంపై బీజేపీ (BJP) అధిష్టానం ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఐ (CPI) రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambhasiva Rao) డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన కరీంనగర్ (Karimnagar)లో మీడియాతో మట్లాడుతూ.. మునుగోడు (Munugodu) ఎన్నికలో సీబీఐ (CPI), బీఆర్ఎస్ (BRS)కు సపోర్ట్ (Support) చేయకపోతే బీజేపీ గెలిచేదని, చాలా మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి వెళ్లే వాళ్ళని అన్నారు.
తెలంగాణ (Telangana), ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh)లో బీజేపీ ఆశలు వదిలేసుకుందని కూనంనేని సాంబశివరావు అన్నారు. దేశంలో రెండే కూటములని.. మూడో దానికి అవకాశం లేదన్నారు. బీఆర్ఎస్‌తో సీపీఐకు బ్రేకప్ కాలేదన్నారు. కుదిరితే పొత్తులు ఉంటాయని, లేదంటే సింగిల్‌గానే పోటీ చేస్తామని, ఎవరికీ తలవంచేది లేదని, లొంగమని, గౌరవానికి భంగం కలిగితే ఊరుకోమని కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-07-09T13:04:36+05:30 IST