ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jagtial: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హౌస్ అరెస్ట్..ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్

ABN, First Publish Date - 2023-04-01T10:58:55+05:30

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని(Congress MLC Jeevan Reddy) పోలీసులు హౌస్‌ అరెస్ట్‌(House arrest) చేశారు. వెల్గటూరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

జగిత్యాల: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని(Congress MLC Jeevan Reddy) పోలీసులు హౌస్‌ అరెస్ట్‌(House arrest) చేశారు. వెల్గటూరు మండలం షాహిగామ వెళ్లేందుకు సిద్ధమైన జీవన్‌రెడ్డి..ఇథనాల్‌ ప్రాజెక్ట్‌ బాధితులను(Ethanol project victims) కలిసేందుకు సిద్ధం కావడంతో ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేశారు. కాగా, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని, డీసీసీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్‎లను(DCC President Laxman Kumar) హౌస్ అరెస్ట్ చేయడం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC President Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మపురి నియోజక వర్గం వెల్కటూర్ మండలంలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్(Congress) వ్యతిరేకిస్తోందన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే అరెస్టులతో నిర్బంధిస్తారా అంటూ రేవంత్ మండిపడ్డారు. జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్‎ల్ లాంటి ప్రజా నాయకులను నిర్బంధిస్తే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇథనాల్ ప్రాజెక్టు ఏర్పాటు వల్ల ఆ ప్రాంతంలో కాలుష్యం అవుతుందని, ప్రజలు, రైతులు ఇథనాల్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్నారని తెలిపారు. ప్రజల పోరాటానికి జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమారులు సంఘీభావం ప్రకటిస్తే హౌస్ అరెస్ట్ చేస్తారా.. ఇది ప్రజాస్వామ్యమా..? ప్రతిపక్ష పార్టీ మండలి నాయకుడిని నిర్భందిస్తారా..? అంటూ ధ్వజమెత్తారు. జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్‎లను వెంటనే విడుదల చేసి పోరాటంలో భాగస్వాములను చేయాలని కోరారు. రైతులు, ప్రజలు కోరుకున్న విధంగా విధానాలను అమలు చేయాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తోందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2023-04-01T10:58:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising