ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSPSC పేపర్ లీకేజ్ కేసులో రీమాండ్ రిపోర్ట్‌లో ‌కీలక అంశాలు..

ABN, First Publish Date - 2023-03-24T11:21:42+05:30

హైదరాబాద్: టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజ్ కేసు (Paper Leakage Case)లో రీమాండ్ రిపోర్ట్‌ (Remand Report)లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజ్ కేసు (Paper Leakage Case)లో రీమాండ్ రిపోర్ట్‌ (Remand Report)లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికి వరకు 12 మంది నిందితులను ఆరెస్ట్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ అధికారులు (SIT Officials) పేర్కొన్నారు. తొమ్మిది మంది నిందితులతో పాటు మరో ముగ్గురుని అరెస్ట్ చేశామని.. అందులో ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులని.. ఇప్పటివరకు నలుగురు టీఎస్పీఎస్సీ ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు సిట్ పేర్కొంది. A1 ప్రవీణ్ టీఎస్పీఎస్సీ సెక్రెటరీ పిఏ, A2 రాజశేఖర్, నెట్ వర్క్ అడ్మిన్, A 10 షమీమ్ ఏఎస్‌వో, A 12 రాజశేఖర్ డాటా ఎంట్రీ ఆపరేటర్ అని, నిందితుల్లో మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులని పోలీసులు తెలిపారు.

19 మంది సాక్ష్యులను విచారించినట్టు రీమాండ్ రీపోర్ట్‌లో సిట్ అధికారులు తెలిపారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగి శంకర్ లక్ష్మిని ప్రధాన సాక్షిగా పేర్కొన్నారు. శంకర్ లక్ష్మితో పాటు టీఎస్పీఎస్సీ, తెలంగాణ స్టేట్ టెక్నీకల్ సర్వీస్ ఉద్యోగులను సాక్షులుగా పేర్కొన్నట్టు సిట్ తెలిపింది. కర్మన్ ఘాట్‌లోని ఒక హోటల్‌లోని యాజమని, ఉద్యోగిని సాక్షిగా పేర్కొన్నారు. హోటల్‌లోని సీసీటీవీ కెమెరాలో పేపర్ ఎక్సెంజ్ వ్యవహారం నిక్షిప్తమైంది. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు షమీమ్, రమేష్, సురేష్‌లను ఆరెస్ట్ చేసి.. నిందితుల నుంచి ఒక ల్యాప్ టాప్, మూడు మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సిట్ అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2023-03-24T11:21:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising