ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ChintaMohan: ఇంటర్ చదివిన ఆదానికి రుణం ఎలా ఇచ్చారు?.. చింతామోహన్ నిరసన

ABN, First Publish Date - 2023-02-06T11:13:05+05:30

తిరుపతి ఎస్‌బీఐ ముందు మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ సోమవారం ఉదయం నిరసనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

తిరుపతి: తిరుపతి ఎస్‌బీఐ (SBI) ముందు మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ ( Former Union Minister Chintamohan) సోమవారం ఉదయం నిరసనకు దిగారు. రూ.30 వేల కోట్ల రుణాన్ని మోదీ స్నేహితుడు అదానీ (Adani)కి రాజకీయ పలుకుబడితో ఎస్‌బీఐ కట్టబెట్టిందని ఆరోపించారు. దేశంలోని 24 వేల బ్రాంచ్‌లు ఉన్న ఎస్‌బీఐ దివాలా తీస్తోందని తెలిపారు. ఇంటర్ చదివిన అదానీనికి ఎలాంటి సూరిటీ లేకుండానే రుణాన్ని ఇచ్చారని... దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్‌బీఐని అదానీ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చండి అంటూ ఎద్దేవా చేశారు. అదానీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎల్ఐసీ (LIC) కూడా అదానీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌గా మార్చాలని ఆయన వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ సీట్లపై జోస్యం...

వచ్చే ఎన్నికల్లో వైసీపీ (YCP)కి 20 సీట్లు మాత్రమే వస్తాయని చింతామోహన్ జోస్యం చెప్పారు. బటన్ నొక్కినంత మాత్రాన జగన్‌ను ప్రజలు నమ్మరన్నారు. వైసీపీలో ఉండలేక ఎమ్మెల్యేలే బయటకు వచ్చేస్తున్నారని తెలిపారు. వైసీపీ హయాంలో ప్రజలు సంతోషంగా లేరని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-02-06T11:13:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!