ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YS Sharmila నివాసం వద్ద ఉద్రిక్తత.. తోపులాట... కిందపడిపోయిన వైఎస్సార్టీపీ చీఫ్

ABN, First Publish Date - 2023-03-28T13:14:26+05:30

వైఎస్సార్‌పార్టీ అధినేత వైఎస్ షర్మిల ఇంటి వద్ద టెన్షన్ వాతావారణం నెలకొంది. ఈరోజు ఛలో ఉస్మానియా ఆస్పత్రికి షర్మిల పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) ఇంటి వద్ద టెన్షన్ వాతావారణం నెలకొంది. ఈరోజు ఛలో ఉస్మానియా ఆస్పత్రి (Challo Osmania Hospital)కి షర్మిల పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కాసేపటి క్రితం ఉస్మానియా ఆస్పత్రి సందర్శన కోసం నగరంలోని లోటస్‌పాండ్‌లోని ఇంటి నుంచి బయటకు వచ్చిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా అడ్డుతగిలారు. దీంతో పోలీసులతో వైఎస్సార్టీపీ చీఫ్ వాగ్వాదానికి దిగారు. పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాటలో షర్మిల కిందపడిపోయారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత అని మరోసారి నిరూపించుకున్నారని మండిపడ్డారు. వైఎస్సార్టీపీని, వైఎస్సార్‌ బిడ్డను చూసి భయపడుతున్నారని అన్నారు. తాను చేస్తున్న పాదయాత్రను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము అడిగి ప్రతీ పరిష్మన్‌ను ఆపుతూనే ఉన్నారని షర్మిల అన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో సౌకర్యాలు లేవన్నారు. రూ.200 కోట్లతో టవర్స్ కడతామని సీఎం 9 ఏళ్ల క్రితం చెప్పారని గుర్తుచేశారు. ప్రజలకు వైద్యం అందడం లేదని తనకు పిర్యాదులు వచ్చాయన్నారు. ప్రతిపక్షాలను ఆపడానికి శాంతి భద్రతల సమస్య అంటారా అంటూ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-03-28T13:17:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising