ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Palamuru Rangareddy Project: ఎన్జీటీ జరిమానాపై సుప్రీం స్టే

ABN, First Publish Date - 2023-02-17T13:00:57+05:30

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌ (Palamuru Rangareddy project)పై శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు (Supreme Court) లో విచారణ జరిగింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై ఎన్జీటీ (NGT) విధించిన రూ.500 కోట్ల జరిమానాపై సుప్రీం స్టే విధించింది. ఎన్జీటీ జరిమానా విధిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సవాల్ చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిపింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజక్టులో పర్యావరణ అనుమతులు ఉన్న 7.15 టీఎంసీల వరకు పని కొనసాగించుకునేందుకు మాత్రమే ఉన్నతన్యాయస్థానం అనుమతించింది. కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకుకోవాలని స్పష్టం చేసింది.

తాగునీటి ఎద్దడిని ఎదుర్కోవద్దని, ప్రజలు ఇబ్బందులకు గురికాకూడదన్న ఉద్దేశ్యంతోనే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా (Justice Sanjeev Khanna), జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌ (Justice MM Sundaresh)ల ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ కేసులో మెరిట్స్‌ ఆధారంగానే తగిన నిర్ణయాలు ఉంటాయని ధర్మాసనం పేర్కొంది. ఈ ప్రాజక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ విధించిన రూ.500 కోట్ల జరిమానాపై సుప్రీం స్టే విధించింది. ఈ కేసుకు సంబంధించి ప్రతివాదులందరికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో ప్రతివాదులు అంతా... కౌంటర్‌ అఫిడవిట్‌లు దాఖలు చేయాలని, ఆ తర్వాత ఆరు వారాల్లో వాటికి సమాధానంగా రిజాయిండర్‌లు దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఆగష్టులో చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.

Updated Date - 2023-02-17T13:00:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising