HYD: సభ్యుల సూచనలు పరిగణలోకి తీసుకుంటాం: హెచ్.ఎం.టి. జనరల్ మేనేజర్ నరేశ్ గురుదాసని
ABN, First Publish Date - 2023-03-05T22:02:05+05:30
హెచ్.ఎం.టి. ఉద్యోగుల సహకార గృహనిర్మాణ సంస్థ జనరల్ బాడీ సమావేశం కూకట్‌పల్లిలోని హెచ్.ఎం.టి. హిల్స్ కాలనీ కమ్యూనిటీ హాల్ లో జరిగింది.
హైదరాబాద్: హెచ్.ఎం.టి. ఉద్యోగుల సహకార గృహనిర్మాణ సంస్థ జనరల్ బాడీ సమావేశం కూకట్‌పల్లిలోని హెచ్.ఎం.టి. హిల్స్ కాలనీ కమ్యూనిటీ హాల్ లో జరిగింది. ఈ సమావేశంలో సంస్థ అధ్యక్షులు, హెచ్.ఎం.టి. జనరల్ మేనేజర్ నరేశ్ గురుదాసని, ఉపాధ్యక్షులు టి.వి. సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఓ. పండరి మాట్లాడుతూ సంస్థ పురోగతిని వివరించారు. వారి హయాంలో జరిగిన అభివృద్ధి గురించి సవివరంగా సభ్యులకు తెలియజేశారు. సంస్థ కోశాధికారి, హెచ్.ఎం.టి. జాయింట్ జనరల్ ఫైనాన్స్ అలోక్ కుమార్ బహేరా సంస్థ ఆడిట్ అయిన అకౌంట్స్‌ను సభకు సమర్పించారు. సంస్థ సభ్యుల నుంచి సలహాలు, సూచనలు తీసుకొని వాటి అమలు సాధ్యాసాధ్యాములను పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో హెచ్.ఎం.టి. కార్మిక సంఘం పూర్వ నాయకులు వెంకన్న, సిద్ధినబోయిన కృష్ణమూర్తి, దుర్గా ప్రసాద్, మాధవాచారి, హెచ్.ఎం.టి. హిల్స్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గాంధీ, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ కె.ఎస్.ఆర్. మూర్తి, ప్రధాన కార్యదర్శి గోపీచంద్, హెచ్.ఎం.టి. స్వర్ణపురి కాలనీ ప్రధాన కార్యదర్శి దేవేందర్ రావుతో పాటు అధిక సంఖ్యలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
సంస్థ పూర్వ డైరెక్టర్లు బాలనర్సయ్య, హెచ్.ఎం.టి. శాతవాహన నగర్ కాలనీ ప్రధాన కార్యదర్శి మచ్చ యాదిరెడ్డితోపాటు ఇతర కార్యవర్గ సభ్యులు, ఉమామహేశ్వర ఆలయ అధ్యక్షులు ఎస్.వి.ఎస్.ఎన్. ప్రధాన కార్యదర్శి హనుమంతరాజు, హెచ్.ఎం.టి. కార్మిక నాయకులు, బి.ఆర్.ఎస్.పార్టీ సీనియర్ నాయకులు అందె నరసింహా తదితరులు పాల్గొన్నారు. చిప్ప అనంతరాములు వందన సమర్పణతో సర్వ సభ్య సమావేశం ముగిసింది.
Updated Date - 2023-03-05T22:05:34+05:30 IST