Hyderabad IIT : ఆగని ఆత్మహత్యలు.. నేడు ఓ విద్యార్థిని.. సూసైడ్ నోట్‌లో ఏం రాసిందంటే..
ABN, First Publish Date - 2023-08-08T09:41:52+05:30
హైదరాబాద్ ఐఐటీలో సంగారెడ్డి శివారులోని కందిలో గల ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో మానసిక ఒత్తిడితో మమైతనాయక్ (21) అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఒడిశాకు చెందిన మమైత్ గత నెల 26న ఎంటెక్ ప్రథమ సంవత్సరంలో చేరింది.
సంగారెడ్డి : హైదరాబాద్ ఐఐటీలో సంగారెడ్డి శివారులోని కందిలో గల ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో మానసిక ఒత్తిడితో మమైతనాయక్ (21) అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఒడిశాకు చెందిన మమైత్ గత నెల 26న ఎంటెక్ ప్రథమ సంవత్సరంలో చేరింది. తన గదిలోనే ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు.. మానసిక ఒత్తిడి గురవుతున్నాను’ అని రాసి ఉన్న లేఖను మమైత గదిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత నెల 17న ఐఐటీ నుంచి అదృశ్యమై. . విశాఖపట్నం బీచ్‌లో కార్తీక్ అనే బీటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే.
ఐఐటీ హైదరాబాద్‌లో ఏడాది కాలంలో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2022 ఆగస్ట్ 31న రాహుల్ అనే ఎంటెక్ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరి వేసుకుని బలవన్మరణం పాలయ్యాడు. గతేడాది సెప్టెంబర్ 6 న రాజస్థాన్ కు చెందిన మేఘా కపూర్ సంగారెడ్డిలో ఓ లాడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్గొండ జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి కార్తిక్ గత నెల 17 న ఐఐటీ క్యాంపస్ నుంచి విశాఖపట్నం వెళ్లి సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా ఒడిశాకు చెందిన మమైత నాయక్ హాస్టల్‌లోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణం పాలైంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించేలా క్యాంపస్‌లో యాజమాన్యం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది.
Updated Date - 2023-08-08T10:03:56+05:30 IST