Physical Harassment: మైనర్‌పై లైంగిక దాడి.. కీచక తండ్రికి 20 ఏళ్ల జైలు శిక్ష
ABN, First Publish Date - 2023-09-22T18:15:45+05:30
కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కీచకుడిగా మారాడు. కడుపున పుట్టిన బిడ్డ అనే కనికరం లేకుండా తండ్రి నీచానికి ఒడిగట్టాడు. కన్న కూతురిపై తండ్రి లైంగిక దాడికి యత్నించి ఓ కసాయి తండ్రి కటాకటాల పాలయ్యాడు. మైనర్ కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన కీచక తండ్రికి ఫోక్సో కోర్టు(POCSO COURT) 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
హైదరాబాద్: కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కీచకుడిగా మారాడు. కడుపున పుట్టిన బిడ్డ అనే కనికరం లేకుండా తండ్రి నీచానికి ఒడిగట్టాడు. కన్న కూతురిపై తండ్రి లైంగిక దాడికి యత్నించి ఓ కసాయి తండ్రి కటాకటాల పాలయ్యాడు. మైనర్ కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన కీచక తండ్రికి ఫోక్సో కోర్టు(POCSO COURT) 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అపరిపక్వ వయస్సు గల బాలికలతో లైంగిక కార్యకలాపాలు వారి జీవితాలపై బాధాకరమైన ప్రభావాన్ని చూపుతాయని ఫోక్సో కోర్టు పేర్కొంది. కన్న తండ్రే ఇలాంటి నేరాలకు పాల్పడితే పిల్లలపై ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని తెలిపింది. ఐపీసీ సెక్షన్లు 354, 509, పోక్సో చట్టం ప్రకారం తన మైనర్ కూతురుపై లైంగిక వేధింపుల కేసులో తండ్రికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2021 నవంబర్30వ తేదీన తన కన్నా కూతురు (10) పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి కసాయి తండ్రి అత్యాచారయత్నం చేశాడు. నిందితుడిని సాక్ష్యాదారలతో సహా హబీబ్ నగర్ పోలీసులు కోర్ట్‌లో హాజరు పరిచారు. కేసును విచారించి..నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, 5వేల రూపాయల జరిమాన విధించిన 12వ అదనపు సెషన్ జడ్జి జస్టీస్ టి.అనిత విధించింది. బాధితురాలికి 5 లక్షల రూపాయల సహాయం అందించాలని అధికారులకు కోర్ట్ ఆదేశించింది.
Updated Date - 2023-09-22T18:17:51+05:30 IST