ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Praja Palana: అభయహస్తం దరఖాస్తుల ఫామ్లతో కొత్త దందాకు తెర.. ఇదేంటని ప్రశ్నిస్తున్న పేదలు

ABN, Publish Date - Dec 28 , 2023 | 12:49 PM

Telangana: తెలంగాణవ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాలు మొదలయ్యాయి. గురువారం అభయహస్తం దరఖాస్తులను అధికారులు ప్రారంభించారు. ఐదు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తు ఫారాలను ప్రజలకు అధికారులు అందజేస్తున్నారు. అయితే ప్రజాపాలన.. అభయ హస్తం అప్లికేషన్ ఫామ్ల విషయంలో సరికొత్త దందాకు కొందరు దళారులు తెరతీశారు.

హైదరాబాద్, డిసెంబర్ 28: తెలంగాణవ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాలు మొదలయ్యాయి. గురువారం అభయహస్తం దరఖాస్తులను అధికారులు ప్రారంభించారు. ఐదు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తు ఫారాలను ప్రజలకు అధికారులు అందజేస్తున్నారు. అయితే ప్రజాపాలన.. అభయ హస్తం అప్లికేషన్ ఫామ్ల విషయంలో సరికొత్త దందాకు కొందరు దళారులు తెరతీశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఒక్కో ఫారంను రూ.50 నుంచి రూ.100 రూపాలకు అమ్ముతున్నారు. ప్రతీ కౌంటర్ వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని పట్టించుకునే వారు లేకపోవడంతో పేద ప్రజలు తప్పదని దరఖాస్తు ఫామ్లను కొనుగోలు చేస్తున్నారు.

ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న అప్లికేషన్ ఫామ్లను కూడా కొందరు దళారులు, జిరాక్స్ సెంటర్లు దళారులు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున అమ్మకాలు చేపట్టంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదల కోసం ప్రభుత్వం తీసుకువస్తున్న పథకాలకు సంబంధించి ఫామ్ల విషయంలో దళారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని పేద ప్రజలు కోరుతున్నారు.


మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అభయహస్తం దరఖాస్తులను అధికారులు ప్రజలకు అందిజేస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పంచాయతీలు, మున్సిపల్‌ వార్డుల్లో దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. పర్యవేక్షణ కోసం మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉండనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 28 , 2023 | 01:11 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising