ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR: నాడి పట్టండి.. ఓట్లు రాబట్టండి

ABN, First Publish Date - 2023-10-23T05:34:20+05:30

‘జనంతో మమేకం కండి.. వారి నాడి పట్టండి.. మన పార్టీ పట్ల, పార్టీ అభ్యర్థి పట్ల వారి అభిప్రాయాన్ని తెలుసుకోండి.. వారిలో ఉన్న సందేహాలను తీర్చి ఓట్లు రాబట్టేలా కృషి చేయండి.

  • ఏ అవకాశాన్నీ వదలొద్దు

  • పార్టీ మేనిఫెస్టో ప్రచారంలో ఇప్పటికే వెనకబడ్డాం

  • ఏదో చేస్తామని కాంగ్రెస్‌ వెళ్తోంది

  • మనం పదేళ్లలో చేసింది చెబుదాం

  • సోషల్‌ మీడియాను బాగా వాడదాం

  • బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ, వార్‌రూమ్‌

  • ఇన్‌చార్జులతో కేటీఆర్‌, హరీశ్‌

  • కేసీఆర్‌కు పిండం పెట్టాలని రేవంత్‌

  • అన్నప్పుడు జానా సంస్కారమేమైంది?

  • ఎన్నికల రణరంగం నుంచి కిషన్‌రెడ్డి పారిపోయారు

  • సర్వేలన్నీ మాకే అనుకూలం: కేటీఆర్‌

హైదరాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ‘జనంతో మమేకం కండి.. వారి నాడి పట్టండి.. మన పార్టీ పట్ల, పార్టీ అభ్యర్థి పట్ల వారి అభిప్రాయాన్ని తెలుసుకోండి.. వారిలో ఉన్న సందేహాలను తీర్చి ఓట్లు రాబట్టేలా కృషి చేయండి. పది ఓట్లయినా సరే పక్కకు (ఇతర పార్టీలకు) పోనీయకుండా చూడాలి’ అంటూ బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జులు, వార్‌రూమ్‌ ఇంచార్జులకు ఆ పార్టీ అగ్ర నేతలు, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌లోని జలవిహార్‌లో ఆదివారం ఈ సమావేశం జరిగింది. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పూర్తిగా వెనకబడ్డామని, ఏదో చేస్తామని చెబుతూ కాంగ్రెస్‌ జనంలోకి వెళ్తోందని సమావేశంలో నేతలు పేర్కొన్నారు. కేసీఆర్‌ పదేళ్ల పాలనలో చేసిన పనులను జనంలోకి ఎలా తీసుకువెళ్లాలన్న దాని పై చర్చించారు. కాంగ్రెస్‌, బీజేపీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని, ఎక్కడ ఏ విమర్శ వచ్చినా తిప్పికొట్టేలా.. నియోజకవర్గాల్లోని నాయకులు సిద్ధంగా ఉండాలని కేటీఆర్‌, హరీశ్‌ సూచించారు. పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సోషల్‌ మీడియాను వాడటం లేదని, సామాజిక మాధ్యమాల ద్వారానే నరేంద్రమోదీకి జనంలో పాపులారిటీ పెరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం సోషల్‌ మీడియా వినియోగం ఎక్కువగా ఉన్నందున దాన్ని వేదికగా చేసుకొని జనంలోకి వెళదామంటూ సూచించారు. మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తదితరులు గత ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ల విషయంలో సమస్యలు తలెత్తాయని, ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా.. పార్టీకి చెందిన లీగల్‌ విభాగం ద్వారా పకడ్బందీగా అఫిడవిట్‌లు సిద్ధం చేసుకోవాలని తెలిపారు.

అంతర్గత విభేదాలు పక్కనపెట్టాలి

ప్రతి నియోజకవర్గంలో వార్‌రూమ్‌ కొనసాగుతుందని.. అక్కడి సమస్యలు అక్కడే పరిష్కారం చేసి, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సంబంధిత ఇంచార్జిలు కృషి చేయాలని పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న అంతర్గత విభేదాలను పక్కన పెట్టి మూడోసారి అధికార దక్కించుకునేందుకు ఐక్యంగా పని చేయాలన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రతి రోజు ఏ విధంగా ముందుకు పోవాలనే అంశాలపై కేటీఆర్‌ చర్చించారు. ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి? ప్రజలను బీఆర్‌ఎస్‌ వైపు ఎలా ఆకర్షించాలి? వంటి వాటిపై వివరించారు. కాంగ్రెస్‌ పార్టీ బీఆర్‌ఎ్‌సపై దుష్ప్రచారం చేస్తోందని, దానిని తిప్పికొట్టేందుకు నియోజకవర్గ స్థాయిలో పార్టీ కేడర్‌ కృషి చేయాలని హరీ్‌షరావు పిలుపునిచ్చారు. ఈ నెలరోజులు బాగా కష్టపడాలని, గ్రామాలు, పట్టణాల్లో ప్రజలను కలుస్తూ.. అవసరమైన చోట్ల రాత్రి అక్కడే ఉంటూ ప్రచారం చేయాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గత వైఫల్యాలను జనంలోకి బలంగా తీసుకువెళ్లాలని, ఆ పార్టీకి అధికారం కట్టబెడితే కలిగే నష్టాలను వివరించాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో అంశాలను సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తూనే... ఇంటింటి ప్రచారంలో భాగంగా స్టిక్కర్లను అంటించాలన్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలపై ప్రతిరోజు ఒకరు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు వెల్లడించాలని, లోకల్‌ కేబుల్‌ టీవీ నెట్‌వర్క్‌లలో కూడా మాట్లాడాలన్నారు. సీఎం సభ జరిగే ప్రదేశాల్లో మేనిఫెస్టో అంశాలను పొందుపరచిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు.

రూ.50 కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవిని అమ్ముకున్న దగుల్బాజీ పార్టీ కాంగ్రెస్‌

చిన్నా పెద్దా తేడా లేకుండా... కేసీఆర్‌కు పిండం పెట్టాలి.. రోడ్డుమీద ఉరి తీయాలి.. రాళ్లతో కొట్టి చంపాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినపుడు ఆ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి సంస్కారం ఎక్కడకు పోయిందని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నేతలకు సంస్కారం లేదని జానా మాట్లాడటం తగదని, కాంగ్రెస్‌ పార్టీ నేతల నుంచి సంస్కారం నేర్చుకునే ఖర్మ తమకు లేదన్నారు. రూ.50 కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవి అమ్ముకున్న దగుల్బాజీ పార్టీ కాంగ్రెస్‌ అంటూ విమర్శించారు. ఆ పార్టీ అధ్యక్షుడు డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆ పార్టీ నేతలే ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారన్నారు. బీజేపీ మొదటి ఎన్నికల జాబితాలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి సీటు దక్కలేదని, ఎన్నికల రణరంగంలో ఆయన వెన్నుచూపి పారిపోయారని ఎద్దేవా చేశారు. బీజేపీకి 100 స్థానాల్లో, కాంగ్రె్‌సకు 40 స్థానాల్లో అభ్యర్థులే లేరని అన్నారు. గత రెండు రోజుల్లో మూడు సర్వే రిపోర్టులు వచ్చాయని, బీఆర్‌ఎ్‌సకు 70కి పైగా స్థానాలు వస్తాయని అవి చెప్పాయన్నార్జు.

Updated Date - 2023-10-23T11:37:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising