ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLC Kavitha: సీఎంతో సమావేశం కానున్న కవిత, కేటీఆర్, హరీష్..

ABN, First Publish Date - 2023-03-18T11:39:48+05:30

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సోమవారం ఈడీ ముందు విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) శనివారం ప్రగతి భవన్‌కు వెళ్లనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ (Delhi Liquor Scam)లో సోమవారం ఈడీ (ED) ముందు విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) శనివారం ప్రగతి భవన్‌ (Pragati Bhavan)కు వెళ్లనున్నారు. ఆమెతోపాటు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కూడా వెళ్లనున్నారు. లిక్కర్ స్కామ్‌లో ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై సీఎం కేసీఆర్ (CM KCR) ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించారు. దేశ వ్యాప్త ఆందోళనకు సంబంధించి ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

కాగా ఎమ్మెల్సీ కవిత కు సుప్రీంకోర్టులో (Suprem Court) ఎదురుదెబ్బ తగిలింది. తన పిటిషన్‌ను త్వరగా పరిష్కరించాలన్న కవిత (Kavitha) అభ్యర్థనను సుప్రీం తిరస్కరించింది. ఈనెల 24నే విచారిస్తామని ఉన్నతన్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈడీ (ED) తనను విచారణకు పిలవడాన్ని సవాల్‌ చేస్తూ కవిత సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా... 24న విచారిస్తామని కోర్టు తెలిపింది. మొన్నటి (మార్చి 16న) ఈడీ విచారణకు కవిత గైర్హాజరయ్యారు. దీంతో ఈనెల 20న విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 20 తేదీలోపే తన పిటిషన్‌పై విచారణ జరపాలని మరోసారి సుప్రీంకోర్టును కవిత అభ్యర్థించారు. అయితే కవిత పిటిషన్‌ను తాము ముందు చెప్పిన విధంగా 24నే విచారిస్తామని.. దాంట్లో ఎలాంటి మార్పు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఈడీ అధికారులు మార్చి 20న సోమవారం తమ కార్యాలయానికి వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని కవితకు మరోమారు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ నెల 24న సుప్రీంకోర్టులో తన పిటిషన్‌ విచారణ జరిగేంత వరకూ ఆగాలని కవిత చేసిన అభ్యర్థనను ఈడీ తోసిపుచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అరుణ్‌ రామచంద్ర పిళ్లైని గురువారం ప్రత్యేక కోర్టు ముందు ప్రవేశపెట్టిన ఈడీ ఆయనను కవితతో కలిపి ముఖాముఖి ప్రశ్నించాల్సి ఉందని తెలిపింది. దీంతో ప్రత్యేక న్యాయస్థానం అరుణ్‌ పిళ్లై కస్టడీని మార్చి 20 వరకు పొడిగించింది. మార్చి 20న ఉదయమే కవిత-అరుణ్‌ పిళ్లైల మధ్య ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి, వాస్తవాలు రాబట్టుకునేందుకు ఈడీ రంగం సిద్ధం చేసిందని, కవిత ఈడీ దర్యాప్తు నుంచి తప్పించుకునే అవకాశాలు లేవని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. కాగా, కవిత రెండు రోజుల క్రితమే ఈడీకి లేఖ రాసి సిద్ధంగా ఉంచారని, సాధ్యమైనంత వరకు ఈడీ దర్యాప్తు తప్పించుకోవాలని ఆమె ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ కవిత విచారణకు సహకరించకపోతే ఈ దఫా విచారణ తర్వాత ఆమెను అరెస్టు చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు అంటున్నాయి.

Updated Date - 2023-03-18T11:39:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising