ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kurnool: జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-04-24T15:56:38+05:30

కర్నూలు: జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను తెలంగాణలో కలపాలని.. అపుడే సాగునీటి సమస్య తీరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జేసీ దివాకర్ రెడ్డి (JC Diwakar Reddy) కీలక వ్యాఖ్యలు (Key Comments) చేశారు. రాయలసీమ (Rayalaseema)ను తెలంగాణ (Telangana)లో కలపాలని.. అపుడే సాగునీటి సమస్య తీరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాయలసీమను కలుపుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదని, తన వంతుగా ప్రజలను కూడగడతానని అన్నారు. రాష్ట్రాలు విడగొట్టడం, కొత్తగా ఏర్పాటు చేయడం కష్టం, కానీ కలపడం సులభమని అన్నారు.

తమ వాళ్ళు ప్రత్యేక రాయలసీమ అంటున్నారని.. వస్తే మంచిదేనని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అప్పర్ భద్ర ప్రాజెక్టు ఆపాల్సిన అవసరం లేదని.. ఆపలేమని అన్నారు. అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం కూడా నిధులు విడుదల చేసిందన్నారు. రాయలసీమను తెలంగాణలో కలుపుకోవలసిన అవసరం కేసీఆర్‌ (KCR)కు ఉందన్నారు. రాయల తెలంగాణ కావడానికి ఎవరికి అభ్యంతరం లేదన్నారు. నాయకులు.. అందరితో మాట్లాడుతున్నానని.. సమీకరిస్తున్నానని.. ఎన్నికల తరువాత వేదికపై ఉన్న నేతలందరిని కలుస్తానని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2023-04-24T15:56:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising