ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: కాంగ్రెస్‌లో చేరిన డీ.శ్రీనివాస్.. కొడుకుతో కలిసి చేరుతున్నట్టు ప్రకటన

ABN, First Publish Date - 2023-03-26T12:28:22+05:30

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ (D.Srinivas) తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీల్‌చైర్‌లో గాంధీభవన్‌ (Gandhi Bhavan)కు వచ్చిన డీఎస్ మాట్లాడుతూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత డీ.శ్రీనివాస్ (D.Srinivas) తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీల్‌చైర్‌లో గాంధీభవన్‌ (Gandhi Bhavan)కు వచ్చిన డీఎస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ (Congress)లో తిరిగి చేరుతుండటం ఎంతో ఆనందంగా ఉందని, సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని అన్నారు. తన పెద్దకొడుకు ధర్మపురి సంజయ్‌ (Dharmapuri Sanjay)తో కలిసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అలాగే మరో నేత మేడ్చల్ సత్యనారాయణ (Medchal Satyanarayana) కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే (Manik Rao Thackeray), పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy), మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు (V.Hanumantarao) డీఎస్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డీఎస్‌కు ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy), జానారెడ్డి (Janareddy), షబ్బీర్ అలీ (Shabbir Ali), అంజన్ కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav), పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah), రేణుకా చౌదరి (Renuka Choudhary), ఇతర ముఖ్య నేతలు పార్టీలోకి ఆహ్వానించారు.

కాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై అనర్హత వేటుకు నిరసనగా ఆదివారం గాంధీ భవన్‌లో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వి.హెచ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్, కోదండ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేణుకా చౌదరి, స్థానిక నేతలు దీక్ష చేపట్టారు. సాయంత్రం 5గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది.

ఈ సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) పార్లమెంట్‌లో మహిళలను అవమానించేలా మాట్లాడారని, ఆయనపై తాను కూడా పరువునష్టం దావా వేస్తానన్నారు. మోదీపై కేసు వేసే విషయంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రధాని ఇప్పుడు తాను ఓబీసీ అంటున్నారని.. అయితే సూర్పనకతో తనను పోల్చారని... సూర్పనకది ఏ కులమని రేణుకా చౌదరి ప్రశ్నించారు.

Updated Date - 2023-03-26T12:37:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising