Hyderabad: గాంధీభవన్‌లో నేడు కాంగ్రెస్ పీఏసీ సమావేశం
ABN, Publish Date - Dec 18 , 2023 | 08:06 AM
హైదరాబాద్: గాంధీభవన్‌లో సోమవారం కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. కాంగ్రెస్‌లో అత్యున్నత నిర్ణయక మండలి అయిన పీఏసీ సమావేశం ఏర్పాటుపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
హైదరాబాద్: గాంధీభవన్‌లో సోమవారం కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. కాంగ్రెస్‌లో అత్యున్నత నిర్ణయక మండలి అయిన పీఏసీ సమావేశం ఏర్పాటుపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. పార్టీ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి పీఏసీ సమావేశం ఇదే. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పీఏసీ సమావేశం నేపథ్యంలో సీఎం, మంత్రులతో సహా ముఖ్యమైన నేతలందరూ ఈ భేటీకి హాజరవుతారు.
అలాగే పార్టీ బలోపేతం, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలపై విస్తృత స్థాయిలో చర్చించనున్నట్లు తెలియవచ్చింది. పార్టీ పథకాల అమలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా పథకాల అమలు, వాటి ప్రయోజనాలు ప్రజలకు చేరేలా పార్టీ నాయకులను సమాయత్తం చేయడం వంటి తదితర అంశాలపై పీఏసీ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.
Updated Date - Dec 18 , 2023 | 08:06 AM