ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News: మహారాష్ట్ర పోలీసుల అదుపులో కావూరి కుమార్తె

ABN, First Publish Date - 2023-10-13T14:30:43+05:30

కాంగ్రెస్ సీనియర్ నేత కావూరి సాంబశివరావు కుమార్తె కావూరి శ్రీవాణిని మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత కావూరి సాంబశివరావు(Congress Senior Leader Kavuri Sambashivarao) కుమార్తె కావూరి శ్రీవాణిని మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శ్రీవాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలో కావూరి శ్రీవాణిపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. చీటింగ్ కేసులో భాగంగా ఎల్ఓసీ మహారాష్ట్ర పోలీసులు జారీ చేశారు. ఈ క్రమంలో నిన్న(గురువారం) రాత్రి దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి కావూరి శ్రీవాణి వచ్చారు. ఈ విషయాన్ని వెంటనే మహారాష్ట్ర పోలీసులకు విమానాశ్రయ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో ఈరోజు(శుక్రవారం) ఉదయం మహారాష్ట్ర నుంచి శంషాబాద్ చేరుకొని శ్రీవాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచి పీటీ వారంట్‌పై శ్రీవాణిని పోలీసులు మహారాష్ట్రకు తీసుకెళ్లనున్నారు.

Updated Date - 2023-10-13T14:44:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising