ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM KCR: అసెంబ్లీలో మార్కెట్లపై ప్రశ్నకు సమాధానంగా సీఎం కేసీఆర్ ఏమన్నారంటే..

ABN, First Publish Date - 2023-02-12T13:09:37+05:30

అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో సమీకృత మార్కెట్లపై వేసిన ప్రశ్నకు సమాధానంగా సీఎం కేసీఆర్ (CM KCR) మాట్లాడుతూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Budget Meetings) ఆదివారం కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తర సమయంలో సమీకృత మార్కెట్లపై వేసిన ప్రశ్నకు సమాధానంగా సీఎం కేసీఆర్ (CM KCR) మాట్లాడుతూ... ఒకప్పుడు కూరగాయలు పండించే విధానం చాలా దుర్భరంగా ఉండేదని, దీని కోసం ఒక శాస్త్రీయ దృక్పథం అనేది ఉండేది కాదన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూరగాయలు పండించే విధానం కూడా సరిగా లేదన్నారు.

మోండా మార్కెట్‌ (Monda Market)ను చాలా సైంటిఫిక్‌ (Scientific)గా కట్టారని, ప్రతి నియోజకవర్గంలో ఆధునిక మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్‌లోనూ చాలా చోట్ల కొత్త మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు మోండా మార్కెట్‌ను చూపించామని, అన్నిచోట్ల ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను వేగంగా నిర్మిస్తున్నామన్నారు. 120 ఏళ్ల కిందట కట్టిన మార్కెట్‌లో మాంసం, కూరగాయలు ఒకే దగ్గర అమ్మినా.. పరిశుభ్రంగా ఉంటుందన్నారు.

ఇది కూడా చదవండి..

ఎందుకు చనిపోవాలనున్నది కాగితంపై రాసిన బాలుడు..

ప్రతి మునిసిపాలిటీలో ఒకటి లేదా రెండు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నారాయణపేట ఎమ్మెల్యే చాలా అద్భుతంగా మార్కెట్ నిర్మించారని కొనియాడారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ కూడా చాలా సుందరంగ తీర్చిదిద్దారన్నారు. కల్తీ విత్తనాలు పాత ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయని, మంత్రి లీడ్ తీసుకొని చోరవ చూపాలని సూచించారు. కల్తీ విత్తనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం మనల్ని చాలా ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

Updated Date - 2023-02-12T13:09:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising