ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: కారులో అచేతన స్థితిలో వ్యక్తి... సీఐ వెళ్లి చూడగా...

ABN, First Publish Date - 2023-03-31T09:25:12+05:30

ఈ మధ్య కాలంలో తరచూ గుండెపోటుకు గురై చనిపోతున్నారు అన్న వార్తలు తరచూ వినపడుతూనే ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో తరచూ గుండెపోటు (HeartAttack)కు గురై చనిపోతున్నారు అన్న వార్తలు తరచూ వినపడుతూనే ఉన్నాయి. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా పలువురు హార్ట్‌ఎటాక్‌కు గురవుతున్నారు. జిమ్ చేస్తూ ఒకరు, షెటిల్ ఆడుతూ మరొకరు, పెళ్లివేడుకలో, క్లాస్‌లో పాఠాలు చెబుతూ, డ్యాన్స్ చూస్తూనే ఉన్నట్టుండి కుప్పకూలి క్షణాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోతున్నారు. అదృష్టం కొద్ది కొందరిని గుండెపోటుకు గురైన వెంటనే సీపీఆర్‌ చేయడంతో మళ్లీ ఊపిరి పోసుకుంటున్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించి సకాలంలో చికిత్స అందజేయడంతో ప్రాణాలు నిలుస్తున్నాయి. ఇలాంటి ఘటనే నగరంలోని పెద్ద అంబర్‌పేటలో చోటు చేసుకుంది. గుండెపోటుకు గురైన వ్యక్తికి రామన్నపేట సీఐ మోతీరాం సీపీఆర్‌ చేసిన మానవత్వాన్ని చాటుకున్నారు. పెద్ద అంబర్ పేట వద్ద ఆగి ఉన్న కారులో ఓ వ్యక్తికి గుండెపోటు వచ్చింది. ఎవరినీ పిలవలేని స్థితిలో సదరు వ్యక్తి అచేతనంగా పడి ఉన్నారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న సీఐ మోతీరాం బాధితున్ని గమనించాడు. గుండెపోటుకు గురైన గుర్తించిన సీఐ.. వెంటనే అతడికి ఘటనాస్థలిలోనే సీపీఆర్ చేశారు. కొద్దిసేపటికి బాధితుడు స్పృహలోకి రావడంతో హుటిహుటిన బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్యులు చికిత్స అందజేయడంతో ఆ వ్యక్తి ప్రాణాలు నిలిచాయి. సమయస్ఫూర్తితో బాధితుడికి సీపీఆర్ చేసిన సీఐ మోతీరాంను ప్రశంసిస్తున్నారు.

Updated Date - 2023-03-31T09:25:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising