ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bandi Sanjay: ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత ద్రోహి...

ABN, First Publish Date - 2023-03-19T13:57:59+05:30

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) దళిత ద్రోహి (Dalit Traitor)గా మిగిలిపోయారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) దళిత ద్రోహి (Dalit Traitor)గా మిగిలిపోయారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు. తెలంగాణ బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రశ్నా పత్రాల లీకేజీ వెనుక సీఎంవో మాజీ అధికారి, ప్రస్తుత బీఆర్ఎస్ నాయకుడు ఉన్నారని ఆరోపించారు. కేసీఆర్ అధికారం చేపట్టిన నాటి నుంచి దళితులపై దాడులు పెరిగిపోయాయన్నారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతికి సీఎం కనీసం నివాళులర్పించటం లేదని విమర్శించారు.

దళిత నియోజకవర్గాల పట్ల సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ముఖ్యమంత్రి పొగిడిన శ్రీలంక (Sri Lanka), చైనా (China), పాకిస్థాన్ (Pakistan) దేశాల పని అయిపోయిందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కారు (Double Engine Govt.)తోనే సాధ్యమని పేర్కొన్నారు. కేసీఅర్ తన బిడ్డ కవిత (Kavitha)ను కాపాడేందుకు మంత్రివర్గం మొత్తం డిల్లీ పోయిందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరిగిన సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు.

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ (TSPSC Question Paper Leakage) వల్ల వేలాది మంది విద్యార్థులు (Students) రోడ్డున పడ్డారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్‌ (KTR)ను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు లక్ష రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ దీక్షలు చేపడుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-03-19T13:57:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising