Baba Fasiuddin: డ్రగ్స్ కేసులో దొరికిన అబ్బుతో నాకు సంబంధం లేదు
ABN, First Publish Date - 2023-10-14T18:11:59+05:30
డ్రగ్స్ కేసులో దొరికిన అబ్బుతో నాకు ఎలాంటి సంబంధం లేదని మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్(Baba Fasiuddin) తెలిపారు.
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో దొరికిన అబ్బుతో నాకు ఎలాంటి సంబంధం లేదని మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్(Baba Fasiuddin) తెలిపారు. శనివారం నాడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘;ప్రొటోకాల్ లేకపోవడంతో కొంతకాలంగా నేను డివిజన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాను. ప్రస్తుతం నాకు పీఏలు అంటూ ఎవరూ లేరు.. అబ్బుతో నాకు ఏ బంధుత్వం లేదు. రాజకీయ కక్ష సాధింపుతో కొంతమంది తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు. అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అని బాబా ఫసీయుద్దీన్ పేర్కొన్నారు.
Updated Date - 2023-10-14T18:13:29+05:30 IST