ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: నేడు ఫ్లైఓవర్లు బంద్‌.. నిబంధనలు పాటించకపోతే చర్యలు

ABN, Publish Date - Dec 31 , 2023 | 10:23 AM

నూతన సంవత్సరానికి స్వాగతం పలికే వేడుకలను ఇన్సిడెంట్‌ ఫ్రీ (జీరో యాక్సిడెంట్స్‌, జీరో డెత్‌)గా జరుపుకొనే విధంగా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ట్రై కమిషనరేట్‌ సీపీలు తెలిపారు.

- ట్రై కమిషనరేట్‌ సీపీలు

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరానికి స్వాగతం పలికే వేడుకలను ఇన్సిడెంట్‌ ఫ్రీ (జీరో యాక్సిడెంట్స్‌, జీరో డెత్‌)గా జరుపుకొనే విధంగా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ట్రై కమిషనరేట్‌ సీపీలు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో కచ్చితంగా నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని డిసెంబర్‌ 31న రాత్రి 11 గంటల నుంచి జనవరి-1 ఉదయం 5 గంటల వరకు ఓఆర్‌ఆర్‌ను మూసి వేస్తున్నట్లు రాచకొండ పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు టికెట్లు చూపిస్తే అనుమతిస్తారని సీపీ తెలిపారు. కామినేని, ఎల్‌బీనగర్‌ ఫ్లైఓవర్లు, ఎల్‌బీనగర్‌, చింతల్‌కుంట అండర్‌పా్‌సతో పాటు.. సాగర్‌ రింగ్‌రోడ్‌ ఫ్లైఓవర్‌ వన్‌సైడ్‌ (ఎల్‌బీనగర్‌ టు మందమల్లమ్మ) వరకు మూసి వేస్తారు. ట్రాఫిక్‌ రద్దీని బట్టి మందమల్లమ్మ నుంచి ఎల్‌బీనగర్‌ వైపు తెరిచి ఉంచుతారు.

హైదరాబాద్‌లో కమిషనరేట్‌ పరిధిలో బేగంపేట, లంగర్‌హౌజ్‌ ఫ్లైఓవర్‌(Begumpet, Langerhouse Flyover)లు మినహాయించి, అన్ని ఫ్లైఓవర్స్‌ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. సైబరాబాద్‌లో ఉన్న అన్ని ఫ్లైఓవర్లను మూసి వేస్తున్నట్లు సీపీ వెల్లడించారు.

Updated Date - Dec 31 , 2023 | 10:23 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising