ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Heavy Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం

ABN, First Publish Date - 2023-06-21T19:39:02+05:30

హైదరాబాద్‌ (Hyderabad) వ్యాప్తంగా ఆకాశం మేఘావృతం అయింది. నగర వ్యాప్తంగా మబ్బులు దట్టంగా కమ్ముకున్నాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొద్ది రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: హైదరాబాద్‌ (Hyderabad) వ్యాప్తంగా ఆకాశం మేఘావృతం అయింది. నగర వ్యాప్తంగా మబ్బులు దట్టంగా కమ్ముకున్నాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొద్ది రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు రావాలంటేనే హడలెత్తిపోయేవారు. అలాంటిది ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో భాగ్యనగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. గోల్కొండ, మెహదీపట్నం, షేక్‌పేట్, ఫిలీంనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్ అబిడ్స్, కోఠి, బేగంబజార్, నాంపల్లిలో భారీ వర్షం పడింది. ఆఫీసుల నుంచి ఇంటికి బయలుదేరిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి రహదారులు జలమయమవ్వడంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. నగరంలో సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారింది. కుండపోత వర్షానికి నగరంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Updated Date - 2023-06-21T19:39:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising