ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Former MP Ponguleti: కాంగ్రెస్ నేత పొంగులేటి సంచలన వ్యాఖ్యలు... ఆయన ఏమన్నారో తెలిస్తే...

ABN, First Publish Date - 2023-08-11T11:29:14+05:30

తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించుకుని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ(Sonia Gandhi)కి గిప్టుగా ఇద్దామని మాజీ ఎంపీ, కాంగ్రెస్‌

మణుగూరు(భద్రాద్రి కొత్తగూడెం): తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించుకుని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ(Sonia Gandhi)కి గిప్టుగా ఇద్దామని మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో కన్వీనర్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) అన్నారు. మణుగూరు(Manuguru) పట్టణంలోని హనుమాన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ నియోజకవర్గ సభలో ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. మాయ మాటలు చెబుతూ 9 ఏళ్లు కాలం తెలంగాణా ప్రజలను సీఎం కేసీఆర్‌ మోసం చేశారని విమర్శించారు. 9 ఏళ్ల కాలంలో ప్రజలకు మేలు ఏమీ చేయకుండా ఇప్పడు ఎన్నికలు వస్తున్న తరుణంలో గృహా లక్ష్మి పధకం పేరుతో మరో మారు ప్రజలనుమోసం చేసి మూడోసారి గద్దెనెక్కెందుకు సిద్దమయ్యారని దుయ్యబట్టారు. బీఫాం ఇచ్చిన అభ్యర్ధుల గెలుపు కోసం అంతా సమిష్టిగా కృషిచేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టాణం ఏ నిర్ణ యం తీసుకుంటే ఆ నిర్ణయానికి తనతో పాటు పినపాక నియోజకవర్గంలోని కాంగ్రెస్‌పార్టీ అశావహులు కట్టు బడి ఉండాలని సూచించిన వ్యక్తిని గెలిపించుకునేందుకు అంతా సమిష్టిగా కృషిచేసి కాంగ్రెస్‌ విజయానికి పాటు పడాలని కోరారు. తన హాయాంలోనే తాను లక్షలాది కోట్ల రూపాయల నిధులను నియోజకవర్గ అభివృద్ధికి తీసుకోచ్చి పనులు చేయించానన్నారు. నియోజకవర్గ సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పొదెం వీరయ్యలను గజ మాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పాయం, సీనియర్‌ నాయకులు చందా లింగయ్య, జిల్లా పార్టీ అధ్యక్షుడు పొదెం వీరయ్య, తుళ్లూరి బ్రహ్మాయ్య(Tulluri Brahmaiah), కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఆ శావహులు శ్రీవాణి, కాటిబోయిన నాగేశ్వరరావు, బట్ట గాంధీ, డాక్టర్‌ చందా సంతోష్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో భారీ మోటార్‌ సైకిల్‌ ర్యాలీ

మణుగూరు రూరల్‌: మాజీ ఎంపీ, కాంగ్రె స్‌ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మన్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పినపాక నియోజకవర్గంలో గురువారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మణుగూరు, పినపాక, అశ్వాపురం, కరకగూడెం(Manuguru, Pinapaka, Ashwapuram, Karakagudem) మండలాల నుంచి కాం గ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మణుగూరు పట్టణ ప్రాంతానికి చేరుకున్నారు. కాంగ్రెస్‌ జెండాలను చేత బూని పొంగులేటి పర్యటనను విజయవంతం చేయాలని ఆకాంక్షిస్తూ మోటార్‌ సైకిల్‌ ర్యాలీలను నిర్వహించారు. పొంగులేటికి నాయకులు కార్యకర్తలు ఘనం స్వాగతం పలికారు. మండలంలోని తోగ్గూడెం గ్రామంలోని సమ్మక్క సారక్క దేవాలయం వద్దకు చేరుకున్న పొంగులేటి తొలుత దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో అభి మానులు కాంగ్రెస్‌ నాయకులు కార్యకర్తలు ద్విచక్రవాహాలపై తోగ్గూడెం నుంచి మణుగూరు పట్టణం వరకు భారీ ప్రదర్శనను నిర్వహించారు.

వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

చర్ల: వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీని వాస్‌ రెడ్డి అన్నారు. గురువారం చర్ల మండల కేంద్రంలో జరిగిన సభలో ఆయన మట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల హామీలు ఇప్పటి వరకు అమలు చెయ్యలేదన్నారు. చర్ల మండలంలో చీమల మర్రి మురళికృష్ణ, దేవభక్తుని రామకృష్ణ, శివ, ఇతరులు పార్టీలో చేరడం పార్టీకీ మరింత బలం అన్నారు. అనంతరం చర్ల మడంలంలోని వివిధ గ్రామాల నుంచి సుమారు 700 కుటుంబాలు పొంగులేటి సమక్ష్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పొదెం వీరయ్య, తెల్లం వెంకట్రావు, నల్లపు దుర్గా ప్రసాద్‌, జడ్పీటీసీ ఇర్పా శాంత, ఎంపీపీ కోదండ రామయ్య తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌

అశ్వాపురం: మండల పరిధిలోని రామచంద్రాపురం గ్రామసర్పంచ్‌ అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కాకా అశోక్‌, మరో ఐదుగురు వార్డు సభ్యులు గురువారం కాంగ్రెస్‌ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. టీపీసీసీ ప్రచారకమిటీ కోచైర్మన్‌, ఖమ్మం మాజీ ఎంపీపొంగులేటి శ్రీనివాసరెడ్డి మండల పర్యటన సందర్భంగా రామచంద్రాపురం సర్పంచ్‌ కాంగ్రెస్‌లో చేరారు. పొంగులేటి, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పొదెం వీరయ్య ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వనించారు. అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని సుజాత, శ్రీనివాసరావు దంపతుల రెండో కుమారుడు నిఖిల్‌ పుట్టిన రోజు సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతులమీదుగా మండల పరిధిలోని సీతారాంపురం అనాథ వృద్దుల ఆశ్రమంలోని వృద్దులకు దుస్తులు పంపిణీ చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్‌ నాయకులు రామచంద్రాపురం వద్ద ఘన స్వాగతం పలికారు.

Updated Date - 2023-08-11T11:29:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising