TSPSC Paper Leakage Case: చంచల్గూడ జైలులో ఈడీ విచారణ
ABN, First Publish Date - 2023-04-17T18:47:25+05:30
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు (TSPSC Paper Leakage Case)లో చంచల్గూడ జైలులో నిందితులను ఈడీ అధికారులు విచారించారు.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు (TSPSC Paper Leakage Case)లో చంచల్గూడ జైలులో నిందితులను ఈడీ అధికారులు విచారించారు. చంచల్‌గూడ జైలు (Chanchalguda Central Jail)లో ప్రవీణ్, రాజశేఖర్‌ను ఈడీ ప్రశ్నించింది. ప్రవీణ్, రాజశేఖర్ బ్యాంక్ ఖాతాలపై ఈడీ అధికారులు ఆరా తీశారు. క్వశ్చన్ పేపర్ (Question paper) అమ్మగా వచ్చిన డబ్బు ఎటు మళ్లించారని ప్రశ్నించారు. రేణుక, లౌకిక్ నుంచి తీసుకున్న రూ.11 లక్షలు.. ఎలా ఖర్చు చేశారని ప్రవీణ్ని ఈడీ బృందం ప్రశ్నించింది. రాజశేఖర్ నుంచి పేపర్ ఎన్ని చేతులు మారింది.. వాటికి సంబంధించి నగదు లావాదేవీల వివరాలపై ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీలో పనిచేసే కొందరికి పేపర్ లీక్ చేసి.. లక్షల రూపాయల నగదు చేతులు మార్చినట్లు ఈడీ గుర్తించింది. మంగళవారం మరోసారి ప్రవీణ్, రాజశేఖర్‌ను ఈడీ బృందం ప్రశ్నించనుంది. పేపర్ లీకేజీ కేసులో ఈడీ మొదటిరోజు విచారణ ముగిసింది.
నలుగురు సభ్యుల ఈడీ అధికారుల బృందం చంచల్‌గూడ జైలు చేరుకుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించారు. నిందితుల తరపు న్యాయవాది సమక్షంలో విచారించాలని ఈడీకి ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే జైలుకు ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్, మొబైల్స్‌ను కోర్టు అనుమతించింది. ఈడీ అధికారులకు వసతులు ఏర్పాటు చేయాలని జైలు సూపరింటెండెంట్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. నలుగురు ఈడీ బృందం వెళ్లి విచారించడానికి న్యాయస్థానం అనుమతించింది. మనీ లాండరింగ్ కోణంలో ఇద్దరు నిందితులను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈరోజు, రేపు చంచలగూడ జైల్లోనే ఈకేసులో ప్రధాన నిందితుల వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేయనున్నారు.
Updated Date - 2023-04-17T18:47:39+05:30 IST