Renuka Chowdari: BRS నేతలు బాంబులు పేల్చడం వల్లే అమాయకులు బలయ్యారు
ABN, First Publish Date - 2023-04-15T17:11:30+05:30
ఖమ్మం ఘటన బాధితులను పరామర్శించడానికి వెళ్తే బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకాచౌదరి (Congress Senior Leader Renuka Chowdari) ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖమ్మం ఘటన బాధితులను పరామర్శించడానికి వెళ్తే బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకాచౌదరి (Congress Senior Leader Renuka Chowdari) ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎక్కడికి వెళ్లాలన్నా పోలీసుల అనుమతి ఉండాలా? అని రేణుకా ప్రశ్నించారు. BRS నేతలు బాంబులు పేల్చడం వల్లే అమాయకులు బలయ్యారని, వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదని, దీనికి బాధ్యులు ఎవరు అని రేణుకా అన్నారు. లోకల్ మంత్రి ఓ పనికి మాలిన వ్యక్తి, రూ.కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొన్నారని రేణుకా చౌదరి మండిపడ్డారు.
శనివారం నిమ్స్ ఆస్పత్రిలో ఖమ్మం ఘటనలో గాయపడిన వారిని పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఖమ్మం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో బాంబులు పేల్చడం వల్ల జరిగిన దుర్ఘటనలో అమాయకులు బలయ్యారన్నారు. వారిని పరామర్శించడానికి వెళితే తనను అడ్డుకున్నారని మండిపడ్డారు. ఘటనా స్థలికి వెళితే తనపై దొంగ కేసులు పెట్టారని మండిపడ్డారు. పోలీసు కొరివితో తల గోక్కోవద్దని.. పోలీస్ వ్యవస్థ గౌరవం పోయేలా వ్యవహరించోద్దని రేణుకా చౌదరి హితవుపలికారు.
Updated Date - 2023-04-15T17:27:18+05:30 IST