CP Swetha : నిందితుడు రాజు వద్ద మీడియా ఐడీ కార్డులు గుర్తించాం
ABN, First Publish Date - 2023-10-30T16:45:27+05:30
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ( MP Prabhakar Reddy )పై మిడిదొడ్డి మండలం పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన గడ్డం రాజు కత్తితో హత్యా యత్నం చేశాడని సిద్దిపేట సీపీ శ్వేత ( CP Swetha ) తెలిపారు.
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ( MP Prabhakar Reddy )పై మిడిదొడ్డి మండలం పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన గడ్డం రాజు కత్తితో హత్యా యత్నం చేశాడని సిద్దిపేట సీపీ శ్వేత ( CP Swetha ) తెలిపారు. సోమవారం నాడు ABNతో సీపీ శ్వేత మాట్లాడుతూ..‘‘వెంటనే అక్కడ ఉన్న కార్యకర్తలు తెరుకొని నిందితుడిపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు వెంటనే పట్టుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం. నిందితుడు ప్రస్తుతం మాట్లాడే పరిస్థితిలో లేడు.. చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించాం. నిందితుడి రాజకీయ నేపథ్యం, ఇతర అంశాలపై విచారణ చేపట్టాం.నిందితుడి క్రైమ్ బ్యాక్ గ్రౌండ్ విషయాలు ఇప్పటిదాక తెలియ రాలేదు.. ఆ దిశగా విచారణ చేపట్టము. నిందితుడి వద్ద వివిధ మీడియా సంస్థలకు చెందిన 6 ఐడీ కార్డులు గుర్తించాం. వాటి వివరాలు కూడా సేకరిస్తాం. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం’’ అని సీపీ శ్వేత తెలిపారు.
Updated Date - 2023-10-30T16:45:27+05:30 IST