ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress Manifesto: పథకాల అమలు కోసం ఏపీ మాదిరిలా ప్లాన్..!

ABN, First Publish Date - 2023-11-18T05:19:08+05:30

అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూములను ఆ జాబితా నుంచి తొలగిస్తామంటూ కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పేర్కొంది.

  • నిషేధిత జాబితా నుంచి పట్టా భూముల తొలగింపు

  • భూ కమతాల సర్వే.. ప్రతిరైతుకు కార్డు.. ల్యాండ్‌ కమిషన్‌ ఏర్పాటు..

  • ప్రభుత్వ పథకాల అమలుకోసం గ్రామ వాలంటీర్‌ వ్యవస్థ ఏర్పాటు

  • ప్రతి నిరుపేద ఆడబిడ్డ పెళ్లికి రూ. లక్ష.. కానుకగా తులం బంగారం

  • అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వృద్ధాశ్రమాలు..

  • వార్డు మెంబర్లకు 1500 గౌరవ వేతనం

  • ఆటోడ్రైవర్‌కు ఏడాదికి రూ. 12 వేలు

  • అభయహస్తం పేరుతో కాంగ్రెస్‌ మేనిఫెస్టో

హైదరాబాద్‌, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూములను ఆ జాబితా నుంచి తొలగిస్తామంటూ కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పేర్కొంది. సమగ్ర భూ కమతాల సర్వేను నిర్వహించి.. ప్రతి రైతుకూ ‘భూధార్‌’ కార్డును అందజేస్తామంది. భూ హక్కులు కోల్పోయిన రైతులందరికీ ఈ సర్వే ఆధారంగా న్యాయం చేస్తామని తెలిపింది. ల్యాండ్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములను పరిరక్షిస్తామని, పౌరుల భూ హక్కులను కాపాడేందుకు రెవెన్యూ ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా ప్రతి భూ యజమానికి పూర్తి హక్కులు కల్పించడమే కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన ధ్యేయం అని తెలిపింది. భూ సంస్కరణల ద్వారా గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పేదలకు పంపిణీ చేసిన సుమారు 25 లక్షల ఎకరాలపైన ఉన్న లబ్ధిదారులకు పూర్తిస్థాయి భూ హక్కులు కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. కోనేరు రంగారావు ల్యాండ్‌ కమిటీ సిఫారసులను అమలు చేయనున్నట్లు పేర్కొంది. గాంధీభవన్‌లో శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా అభయహస్తం పేరుతో విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో ఈ మేరకు స్పష్టతను ఇచ్చింది. మేనిఫెస్టోను నాలుగు చాప్టర్లుగా విభజించింది. మొదటి చాప్టర్లో సుపరిపాలను ఏ విధంగా అందిస్తామన్నది వివరించింది. రెండో చాప్టర్‌లో ఆరు గ్యారెంటీలను, మూడో చాప్టర్లో రైతు, యువత, ఎస్సీ.. ఎస్టీ, బీసీ, మైనారిటీ డిక్లరేషన్లను పేర్కొంది. ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్లను ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్‌.. వాటిని ప్రజల్లోకీ విస్తృతంగా తీసుకెళుతోంది. నాలుగో చాప్టర్లో మాత్రం 37 అంశాల్లో పలు హామీలను గుప్పించింది. తమ ప్రభుత్వం రాగానే తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌.. దానికి సంబంధించి జాబ్‌ క్యాలెండర్‌నూ మేనిఫెస్టోలో విడుదల చేసింది.

మూడో చాప్టర్‌లో 37 అంశాల్లో ఇచ్చి హామీల్లో ముఖ్యమైనవి

  • తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి 250 గజాల ఇంటి స్థలం, గౌరవ భృతి.

  • రూ. 3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలు

  • వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్తు

  • కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపు భూముల రైతులకు ఆర్థికసాయం. గోదావరి, కృష్ణ పరివాహక ప్రాంతాలలో కరకట్టల నిర్మాణం.

  • వడ్ల కొనుగోళ్లలో తేమ శాతం నెపంతో తరుగు తీసే విధానం రద్దు.

  • ప్రజాభిప్రాయ ేసకరణతో హైకోర్టు ఆదేశానుసారం ఫార్మా సిటీల రద్దు

  • పాల ఉత్పత్తిదారులకు లీటర్‌కు రూ. 5 ప్రోత్సాహకం.

  • కోతుల నివారణకు ప్రతి జిల్లాలో స్టెరిలైజ్‌ (సంతాన నిరోధక) కేంద్రం.

  • కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవినీతి, అవకతవకలపై హైకోర్టు సిటింగ్‌ జడ్జితో న్యాయ విచారణ.

  • ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేసి ఎగువ ప్రాంతాలైన ఆదిలాబాద్‌ సహా ఇతర జిల్లాలకు నీరు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజక్టులను సకాలంలో పూర్తి చేసి, హరిత తెలంగాణగా ఆవిష్కరణ.

  • ఒక్కసారి రుసుము చెల్లించి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో పేరు నమోదు చేసుకుంటే అభ్యర్థులు ఆ సంవత్సరంలో మిగతా నోటిఫికేషన్లకు రుసుం చెల్లించవలసిన అవసరంలేదు.

  • ప్రతి జిల్లా కేంద్రంలో ఒక పారిశ్రామిక వార్డును ఏర్పాటు. అనుబంధంగా ఉపాది నైపుణ్య కేంద్రం. ప్రతి నిరుద్యోగ యువతకు ఉపాధి.

  • ప్రతి విద్యార్థి, విద్యార్దినులకు ఫ్రీ (ఇంటర్నెట్‌) వైఫై సౌకర్యం.

  • అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులకు నెలవారీ వేతనం రూ. 10,000 లకు పెంపు.

  • దశల వారీగా ప్రభుత్వ పాఠశాలాల్లో ఇంగ్లిష్‌ మీడియంలో బోధనా విధానం.

  • ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాలో నూతన విశ్వవిద్యాలయాలు.

  • ఆరోగ్య శ్రీ కింద అన్ని రకాల వ్యాధులకు రూ. 10 లక్షల వరకు వర్తింపు. ఈ పథకం పరిధిలోకి మోకాలు సర్జరీ.

  • రేషన్‌ కార్డులపై ఇకనుంచి సన్న బియ్యం సరఫరా.

  • రేషన్‌ డీలర్స్‌కు రూ. 5 వేల గౌరవ వేతనంతో పాటూ కమిషన్‌ పెంపు.

  • గ్రామ పంచాయితీ వార్డు మెంబర్లకు నెలకు రూ. 1500 గౌరవ వేతనం. మాజీ సర్పంచులకు, ఎంపీటీసీ.. జెడ్పీటీసీ సభ్యులకు గౌరవ పెన్షన్‌.

  • ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్‌లో వున్న మూడు డీఏల తక్షణ చెల్లింపు.

  • రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఫస్టు తారీఖున వేతనాలు అందేలా చర్యలు. 15 పనిదినాల్లో సప్లిమెంటరీ బిల్లుల చెల్లింపు.

  • సీపీఎస్‌ విధానం రద్దు చేసి ఓపీఎస్‌ విధానం అమలు.

  • హైదరాబాద్‌లో సెమీకండక్టర్‌ పరిశ్రమను ఆకర్షించేందుకు ఫ్యాబ్‌ సిటీ ప్రాజెక్టును పునఃప్రారంభం

  • ఆర్టీసీ యూనియన్‌ పునరుద్ధరణకు అనుమతి.

  • ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ. 12000 ఆర్థిక సహాయం.

  • రవాణా వాహనాలపై సింగల్‌ పర్మిట్‌ విధానం.

  • పెండింగ్‌ లో ఉన్న అన్ని ట్రాఫిక్‌ చలానాలు 50ు రాయితీతో వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా పరిష్కారం.

  • ప్రతి నిరుపేద ఆడబిడ్డ వివాహానికి రూ. లక్ష సాయం... ఇందిరమ్మ కానుకగా తులం బంగారం.

  • అంగన్వాడీ టీచర్లకు నెలసరి వేతనం రూ.18000కు పెంపు

  • ఎస్టీ జాబితాలోకి వాల్మీకి బోయలు

  • తెలంగాణా ఆవిర్భావ దశలో బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి బీసీ జాబితాలో చేర్చే అంశం పునః పరిశీలన

  • సంచార జాతులకు విద్య, ఉద్యోగ అవకాశాలలో 5ు రిజర్వేషన్‌ అంశం పరిశీలన.

  • గొర్రెల కొనుగోలుకు రూ.2 లక్షలు దళారీ వ్యవస్థలేకుండా నేరుగా పెంపకందారుకు బ్యాంకు అకౌంట్లో జమ

  • ఈబీసీలకు ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు. ఆర్య, వైశ్య.. రెడ్డి కులస్తులకు సరిపడా నిధులతో కూడిన కార్పొరేషన్‌లు

  • పట్టణ , మునిసిపాలిటీల్లోని చిరు వ్యాపారులకు ‘తై బజార్‌ పన్ను’ రద్దు చేస్తాం.

  • రూ. 100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు. సుదీర్ఘ కాలంగా పెండిరగ్‌లో వున్న హైదరాబాద్‌ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం. అర్హులైన ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌ మీడియా జర్నలిస్టులకు జిల్లాల వారీగా ఇళ్ల స్థలాలు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 లక్షల నగదు. రిటైరైన జర్నలిస్టులకు పెన్షన్‌. ‘జర్నలిస్టు హెల్త్‌ స్కీమ్‌’ను జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందేలా హెల్త్‌ కార్డుల జారీ.

  • చలన చిత్ర అభివృద్థికి కొత్త స్టూడియోల నిర్మాణానికి ఆర్థిక సహాయంతో పాటూ స్థలాలను కేటాయిస్తాం.

  • హిందూ దేవాలయాలు, ఆదివాసీ, గిరిజన పూజారులకు ధూప- దీప నైవేద్యాలు కోసం నెలకు రూ. 12 వేల ఆర్థిక చేయూత.

  • అన్యాక్రాంతమైన దేవాలయాలు, మసీదులు, చర్చి భూముల పరిరక్షణకు ప్రత్యేక చట్టం.

  • గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా అన్ని నగరాలు, మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి 25 వేల లీటర్ల మంచి నీటిని ఉచిత సరఫరా.

  • 57 ఏళ్లు పైబడినవారందరికీ (వారి సంతానం ప్రభుత్వ ఉద్యోగులైనప్పటికీ) వృద్థాప్య పెన్షన్లు రూ. 4000 అందజేత.

  • అన్ని జిల్లా కేంద్రాలలో ‘ఓల్డ్‌ ఏజ్‌ హోమ్స్‌’ ఏర్పాటు. కేంద్ర చట్టాన్ని అనుసరించి వృద్థుల సంరక్షణ కొరకు ప్రత్యేక బడ్జెట్‌

  • దివ్యాంగుల నెలవారీ పెన్షన్‌ రూ. 6000 పెంపు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

  • ప్రభుత్వ శాఖల్లో రిజర్వేషన్‌ పాలసీని పటిష్ఠంగా అమలుపరచడంతోపాటు, బ్యాక్‌ లాగ్‌ పోస్టులను భర్తీ.

  • ట్రాన్స్‌ జెండర్స్‌కు లింగ మార్పిడి ధ్రువీకరణ పత్రం, గుర్తింపు కార్డులు జారీ చేస్తూ సామాజిక భద్రత.

  • 50 ఏళ్లు దాటిన జానపద కళాకారులకు నెలకు రూ. 3000 పెన్షన్‌. ఒగ్గు, డప్పు కళాకారులకు నెలవారీ జీవన భృతి రూ. 3000 చెల్లింపు.

పథకాల అమలుకు గ్రామ వాలంటీర్‌ వ్యవస్థ

ప్రభుత్వ పథకాల అమలు కోసం గ్రామీణ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణను పరిశీలించి నూతన జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. కొత్తగా ఏర్పాటు చేసే ఒక జిల్లాకు పీవీ నర్సింహారావు పేరును, జనగామ జిల్లాకు సర్వాయి పాపన్నగౌడ్‌ పేరును పెట్టనున్నట్లు మేనిఫెస్టోలో వెల్లడించింది. సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బారును నిర్వహిస్తామని, ప్రజా ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ను అదుబాటులోకి తెస్తామనీ వెల్లడించింది. ఈ మేరకు సుపరిపాలన పేరుతో తొలి చాప్టర్‌లో హామీలను ఇచ్చింది.

Updated Date - 2023-11-18T12:57:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising